మెగాస్టార్ కి హైకోర్టులో ఊరట - జీహెచ్ఎంసీపై కోర్టు ఆగ్రహం

ఫోన్‌లు, విజ్ఞప్తులు, చివరకు న్యాయమార్గం – మెగాస్టార్‌ను కోర్టుకు నెట్టిన జీహెచ్ఎంసీ వ్యవహారం;

Update: 2025-07-15 13:08 GMT

తెలుగు సినీ ప్రపంచంలోనే కాదు, సమాజంలోనూ మంచి పేరు సంపాదించిన మెగాస్టార్ చిరంజీవి వినమ్రత, శాంతస్వభావంతో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు. ఆయన మాటకు సినిమా పరిశ్రమలోనూ మరియు రాజకియం పార్టీలలోనూ ఎంతో విలువ ఉంది, అయన మాట్లాడిన ప్రతీ పదానికి పవర్ ఉంటుంది. అలాంటి చిరంజీవి తలపెట్టిన పని ఆలస్యం అవుతుందంటే ఆశ్చర్యమే కాదు, ఆందోళనకరం కూడా.

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో చిరంజీవికి ఉన్న నివాసం గురించి అందరికీ తెలుసు. 2000వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలిసి అవసరమైన అనుమతులు తీసుకుని జీ+2 స్థాయిలో ఇల్లు నిర్మించారు. దాదాపు పదిహేను సంవత్సరాల తరువాత – ఇంటిని కొంత రీనోవేషన్ చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా రిటైనింగ్ వాల్ నిర్మాణంతో పాటు కొన్ని మార్పులు చేయాలనుకున్నారు.

ఈ క్రమంలో చిరంజీవి గత నెల 5వ తేదీన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) కు అధికారికంగా దరఖాస్తు చేశారు. కానీ నెల రోజులైనా అధికారులు ఎలాంటి స్పందన ఇవ్వలేదు. అనుమతులు రావటమే కాదు, ఫోన్లకు కూడా స్పందించకపోవడం చిరంజీవికి నిరాశ కలిగించింది. ఆపై చిరంజీవి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది.

కోర్టుకు చిరు వివరించిన అంశాల ప్రకారం – చట్టబద్ధంగా అనుమతులు కోరుతున్నప్పటికీ అధికారులు స్పందించకపోవడం సబబు కాదని అభిప్రాయపడ్డారు. దీనిపై స్పందించిన హైకోర్టు, జీహెచ్ఎంసీ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ – అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు, చట్టబద్ధమైన నిర్మాణాలకు మాత్రం ఎందుకు అనుమతి విస్మరిస్తున్నారు? అని ప్రశ్నించింది. చిరంజీవి గృహ రీనోవేషన్‌కు అనుమతులు తక్షణమే మంజూరు చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.

ఈ వ్యవహారమంతా ఒక దశలో ప్రజాస్వామ్యంలో బలమైన పేరున్న వారికే అనుమతులు ఇబ్బందిగా వస్తే, సాధారణ పౌరులకు పరిస్థితి ఏంటి? అనే ప్రశ్నలు కూడా ప్రజలలో కలుగుతుంది.చిరంజీవి లాంటి వ్యక్తే కోర్టును ఆశ్రయించాల్సిన అవసరం రావడమే ఇందుకు ఉదాహరణగా తెలుస్తుంది.

Tags:    

Similar News