ఓటీటీలోకి వచ్చిన మలయాళ కామెడీ చిత్రం
మానోరమా మ్యాక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా ఏప్రిల్ 12 నుంచి స్ట్రీమింగ్‌లో అందుబాటులోకి వచ్చింది. వారి అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో.. ‘బ్యాడ్ బాయ్స్’ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేస్తున్నట్టు ప్రకటించారు.;
లాస్టియర్ సెప్టెంబర్ 14న థియేటర్లలో విడుదలైన మలయాళ కామెడీ ఎంటర్‌టైనర్ ‘బ్యాడ్ బాయ్స్’ తాజాగా ఓటిటీలో స్ట్రీమింగ్ మొదలు పెట్టింది. థియేటర్స్ లో విడుదలైనప్పుడు ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభించింది. కొందరు ప్రేక్షకులు దీన్ని "మైండ్‌లెస్ ఫన్"గా అభివర్ణించారు. హాస్యంతో నిండిన పిచ్చి చేష్టల చిత్రంగా వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ సినిమా మానోరమా మ్యాక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా ఏప్రిల్ 12 నుంచి స్ట్రీమింగ్‌లో అందుబాటులోకి వచ్చింది. వారి అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో.. ‘బ్యాడ్ బాయ్స్’ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
ఈ చిత్రం కథాంశం కొంతమంది స్నేహితుల గుంపు చుట్టూ తిరుగుతుంది. వీరంతా కలిసి “బ్యాడ్ బాయ్స్” అనే పేరుతో ఒక ఆర్ట్స్ అండ్ స్పోర్ట్స్ క్లబ్‌ను స్థాపిస్తారు. ఈ గ్యాంగ్‌కు నాయకుడు అన్టప్పన్. అతడు లక్ష్యాలు లేకుండా తిరిగే వ్యక్తి. అయితే అతడు ప్రేమించిన అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి స్థానిక గూండాగా మారతాడు. అంతా బాగానే సాగుతున్నట్టుండగా, ఊహించని విధంగా ఒక డ్రగ్ మాఫియా వారి జీవితాల్లోకి ప్రవేశిస్తుంది. ఇది వారి శాంతియుత జీవితాలను భంగపెట్టే ప్రమాదంగా మారుతుంది.
అంటప్పన్, సింటప్పన్, ఇతర స్నేహితులు తమ పేరును నిలబెట్టుకోవాలనే కర్తవ్యభావంతో ముందుకు వస్తారు. మాఫియా గ్యాంగ్‌ను తరిమికొట్టడానికి వారు తమశక్తిమేర యత్నిస్తారు. అలా వారు ఎదురైన సవాళ్లను జయించి, మళ్లీ వారి సమాజంలో స్థిరతను తీసుకురావాలనుకుంటారు.
ఈ సినిమాలో రహ్మాన్, బాబు ఆంటోని, ధ్యాన్ శ్రీనివాసన్, బిబిన్ జార్జ్, అన్సన్ పాల్, సెంటిల్ కృష్ణ, సాయిజు కురుప్, శీలు అబ్రహం తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఓమర్ లులు దర్శకత్వం వహించగా, కథను కూడా ఆయనే రాశారు. సంగీతాన్ని విలియమ్ ఫ్రాన్సిస్ అందించారు. మలయాళ కామెడీ సినిమాలంటే ఇష్టం ఉంటే.. "అర్థం కాని అల్లరి"తో కూడిన వినోదాన్ని ఆస్వాదించగలగితే, బ్యాడ్ బాయ్స్ ఓ సారి చూసేయచ్చు.