ఈవారం ఓటీటీ చిత్రాలు

ఈ వారంలో పలు క్రైమ్, మిస్టరీ, యాక్షన్, కామెడీ కథాంశాలతో కూడిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీ ప్లాట్‌ఫామ్ లలో స్ట్రీమింగ్ కి వచ్చేశాయి.;

By :  S D R
Update: 2025-07-26 11:59 GMT

ఈ వారంలో పలు క్రైమ్, మిస్టరీ, యాక్షన్, కామెడీ కథాంశాలతో కూడిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీ ప్లాట్‌ఫామ్ లలో స్ట్రీమింగ్ కి వచ్చేశాయి. పలు భాషల నుంచి తెలుగుఓ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాలలో ముందుగా చెప్పుకోవాల్సింది 'మార్గన్'. విజయ్‌ ఆంటోనీ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్‌ ‘మార్గన్‌’ ఇప్పుడు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళ భాషల్లోనూ అందుబాటులో ఉంది. ఒక ఇంటెన్స్ మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే కథ ఇది.

పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, ఇబ్రహీం అలీఖాన్‌, కాజోల్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్‌ డ్రామా ‘సర్జమీన్‌’ జియో హాట్‌స్టార్‌లో విడుదలైంది. కశ్మీర్‌ నేపథ్యంలో, ఉగ్రవాదంపై ఆర్మీ అధికారుల పోరాటాన్ని ఆసక్తికరంగా చూపించే సినిమా ఇది. ఇక బాలీవుడ్‌ నటి వాణీ కపూర్‌ ప్రధాన పాత్రలో నటించిన మిస్టరీ థ్రిల్లర్‌ సిరీస్‌ ‘మండల మర్డర్స్’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. చరణ్‌దాస్‌పూర్‌లో శతాబ్దాల కిందట జరిగిన హత్యల చుట్టూ అల్లుకున్న కథలో రహస్యాలతో ఈ సిరీస్ సాగుతుంది.

దిలీష్ పోతన్‌, రోషన్‌ మాథ్యూ నటించిన మలయాళ పోలీస్‌ డ్రామా ‘రోంత్‌’ కూడా జియో హాట్‌స్టార్‌లో తెలుగులో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇద్దరు పోలీసుల ఓ చిన్న నిర్ణయం ఎలా వారి జీవితాలనే మార్చేసిందన్నది ఈ కథ. ఇక మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన కామెడీ డ్రామా ‘ఇట్టిమాని’ ఇప్పుడు తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో అందుబాటులో ఉంది. 2019లో మలయాళంలో ఈ చిత్రం విడుదలైంది. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ మేళవించిన కథనం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ.

Tags:    

Similar News