ఓటీటీలోకి వచ్చేస్తోన్న ‘మార్గన్’
ఈ చిత్రం జూలై 25, 2025 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమిళం, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.;
తమిళ హీరో, గాయకుడు, నిర్మాత, దర్శకుడు విజయ్ ఆంటోనీ చివరిగా లియో జాన్ పాల్ దర్శకత్వంలో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ ‘మార్గన్’ లో కనిపించాడు. ఈ సినిమా జూన్ 27, 2025న థియేటర్లలో విడుదలై.. విమర్శకులు, ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనలు అందుకుంది. నాలుగు వారాల థియేటర్ రన్ పూర్తి చేసిన మార్గన్ ఇప్పుడు డిజిటల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
ఈ చిత్రం జూలై 25, 2025 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమిళం, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. విజయ్ ఆంటోనీ తన రాబోయే చిత్రం భద్రకాళి తెలుగు ప్రెస్ మీట్‌లో ‘మార్గన్’ ఓటీటీ విడుదలను స్వయంగా ప్రకటించారు. భద్రకాళి సెప్టెంబర్ 5, 2025న థియేటర్లలో విడుదల కానుంది.
మార్గన్ ఓటీటీలో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందనేది చూడాలి. ఈ చిత్రంలో అజయ్ ధీషన్, సముద్రఖని, బ్రిగిడ సాగా, దీప్సిక, మహానది శంకర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. విజయ్ ఆంటోనీ ఈ సినిమాకు సంగీతం కూడా సమకూర్చారు.