25 OTT యాప్స్‌ను బ్లాక్ చేసిన కేంద్రం

వినోదానికి హద్దులు ఉంటాయి, చట్టాల్ని అతిక్రమిస్తే ప్రభుత్వ చర్యలు తప్పవని స్పష్టం.;

Update: 2025-07-26 06:17 GMT

ఒకప్పుడు సోషల్ మీడియాలో చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లు మాత్రమే ప్రజల్ని ఆకట్టుకునే విధంగా ఉండేవి.కానీ 2018 తర్వాత ఓ యాప్‌ వచ్చింది – పేరు "ఉల్లు (ULLU)". ఇది సాధారణంగా వినిపించే పేరు అయినా, దీని వెబ్ సిరీస్‌లు మాత్రం అసాధారణమైనవి. ఇంటిమేట్ కంటెంట్, గ్లామర్ అధికంగా ఉండే కథలతో ఈ యాప్‌ త్వరగా యువతలో పాపులర్ అయింది.

కొద్ది కాలంలోనే ఉల్లు యాప్‌కు భారీ ఆదరణ వచ్చింది. ఇండియాలోనే ఐదు కోట్లకు పైగా యూజర్లు దీనిని వాడుతున్నారు. 2025లో మొదటి ఆరు నెలలకే నాలుగు లక్షల మంది కొత్తగా డౌన్‌లోడ్ చేశారు. దీన్ని సబ్‌స్క్రైబ్ చేసుకునే వాళ్లు, ముఖ్యంగా యువత, ఇలాంటి OTT లను ఫాస్ట్ & బోల్డ్ ఎంటర్టైన్‌మెంట్‌ కోసం చూసేవాళ్లు ఎక్కువ అయ్యారు. వీటిలో కొన్ని కథలు గ్రామీణ నేపథ్యం, కొన్ని అర్బన్ లవ్ డ్రామాల్లా ఉన్నా కానీ వాటన్నిటినీ కలిపే అంశం బోల్డ్ కంటెంట్ మాత్రమే.

సోషల్ మీడియాలో పాపులర్ అయిన ఇన్‌స్టాగ్రామ్ మోడల్స్, టీవీ సెలబ్రిటీలు కూడా ఈ ప్లాట్‌ఫార్మ్‌కు లైన్‌లోకి వచ్చారు. ఎందుకంటే ఇక్కడ ఖర్చు తక్కువ, ప్రాధాన్యత ఎక్కువ. ఈ బుల్లితెరలో పాప్యులర్ అయిన “హౌస్ అరెస్ట్”, “పలంగ్ తోడ్”, “చర్మ సుఖ్” లాంటి సిరీస్‌లతో ఒక్కసారిగా ఫాలోయింగ్ డబుల్ అయింది. వీడియోల ట్రైలర్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో యాప్ డౌన్‌లోడ్ రేటు కూడా పెరిగిపోయింది. చాలా మంది వీటిని వీక్షించడానికి ప్రత్యేకంగా సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటున్న పరిస్థితి.

అయితే ఇదంతా చూసిన పెద్దలు బోల్డ్ కంటెంట్ సిరీస్ వల్ల పిల్లల విషయంలో ఆందోళన చెందుతున్నారు.పిల్లలు కూడా ఈ యాప్‌లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అన్న ఆందోళన మొదలైంది.ఇలాంటి ott లో ఫ్లాట్ ఫామ్లో బాలక్రమాలను ప్రభావితం చేసేలా కంటెంట్ ఉండటం, ఎలాంటి వయసు నిర్ధారణ లేకుండా అందరికీ యాక్సెస్ ఇవ్వడంపై పిల్లల హక్కుల కమిషన్ (NCPCR) ఆగ్రహం వ్యక్తం చేసింది. Ullu, Uncut, Prime Play లాంటి యాప్‌లలో బహిరంగంగా పోర్న్‌గ్రాఫిక్ సన్నివేశాలు ఉన్నాయని నివేదికలు వచ్చాయి. ఇది చూసిన కేంద్రం ఇక కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

2025 మేలో 'హౌస్ అరెస్ట్' అనే ఓ వెబ్ సిరీస్ పై ముంబయి పోలీసులు FIR నమోదు చేశారు. ఇందులోని కొన్ని సన్నివేశాలు విచిత్రంగా, అసభ్యంగా ఉన్నాయని ప్రజలు ఫిర్యాదు చేయగా... ఉల్లు యాప్ ప్రొడ్యూసర్లు, నటుడు అజాజ్ ఖాన్ మొదలైనవారిపై కేసులు నమోదయ్యాయి. విబూ అగర్వాల్ అనే CEOపై కూడా విచారణ జరిగింది. ఇది దేశవ్యాప్తంగా ఓ ఉదాహరణగా మారింది – OTTలు కూడా చట్టాల ముందు సమానమేనని నిర్ధారణ అయింది.

జులై 25, 2025, ఉదయం నుంచే వార్తా ఛానళ్లలో ఒకే వార్త – "ULLU, ALTT, MoodX, Desiflix వంటి 25 OTT ప్లాట్‌ఫార్మ్‌లను భారత ప్రభుత్వం బ్లాక్ చేసింది". ఇది భారతదేశంలో డిజిటల్ ప్రపంచంలోనే ఒక కీలక మలుపు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ స్పష్టంగా తెలిపింది – ఈ యాప్‌లు ఐటీ చట్టంలోని సెక్షన్ 67, 67A మరియు IPC సెక్షన్ 292 ప్రకారం అనైతిక కంటెంట్ ప్రసారం చేస్తున్నాయని. అందుకే వాటిని భారతీయ ISPs ద్వారా అడ్డుకునే విధంగా చర్యలు తీసుకున్నట్టు తెలియచేసింది.

ఈ చర్య వల్ల ఏం జరిగింది అంటే... గతంలో డబ్బు పెట్టి సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న యూజర్లకి కూడా ఈ యాప్స్ అందుబాటులో లేకుండాపోయాయి. చాలామంది సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేయగా... ప్రభుత్వం మాత్రం తాము నైతికత, చట్టబద్ధతకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. పోర్న్‌గ్రాఫీ భారతదేశంలో చట్ట విరుద్ధమని మరోసారి గుర్తు చేసింది.

సాంకేతిక విజ్ఞానం అందరికీ అందుబాటులో ఉన్నా, దాన్ని ఉపయోగించే విధానాన్ని చట్టాలు నిర్దేశిస్తాయి. OTT ప్లాట్‌ఫార్మ్‌లు వినోదానికి మార్గమవుతాయి కానీ, చెడు ప్రభావాలు తీసుకొస్తే తప్పకుండా నియంత్రణ వస్తుంది. ఉల్లు, అల్ట్బాలాజీ లాంటి ప్లాట్‌ఫార్మ్‌లు ఇప్పుడు దీన్ని గట్టిగా తెలుసుకున్నాయి.

Tags:    

Similar News