'అఖండ 2' కోసం ఆన్‌బోర్డులోకి యంగ్ హీరో?
నటసింహం బాలకృష్ణ సూపర్ హిట్ మూవీ 'అఖండ'కి కొనసాగింపుగా తెరకెక్కుతున్న చిత్రం 'అఖండ 2: తాండవం'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది.;
నటసింహం బాలకృష్ణ సూపర్ హిట్ మూవీ 'అఖండ'కి కొనసాగింపుగా తెరకెక్కుతున్న చిత్రం 'అఖండ 2: తాండవం'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. అన్నపూర్ణ స్టూడియోలో ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ వేసిన సెట్లో కీలకమైన యాక్షన్ సీన్లు తెరకెక్కిస్తున్నారు. రామ్-లక్ష్మణ్ మాస్టర్‌లు కొరియోగ్రాఫ్ చేసిన ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో ఒన్ ఆఫ్ ది హైలైట్స్ లో ఒకటి అని చెబుతోంది టీమ్.
'అఖండ 2'లో టాలెంటెడ్ యాక్టర్ ఆది పినిశెట్టి కీలక పాత్ర పోషిస్తున్నాడట. గతంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'సరైనోడు' చిత్రంలో విలన్ గా నటించాడు ఆది. 'అఖండ 2'లోనూ ఆది రోల్ ఎంతో పవర్‌ఫుల్ గా ఉంటుందట. లేటెస్ట్ గా షూటింగ్ జరుపుకుంటున్న యాక్షన్ సీక్వెన్స్ లో ఆది పాల్గొంటున్నాడట.
ఈ సినిమాలో సంయుక్త, ప్రగ్య జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట నిర్మిస్తుండగా, బాలకృష్ణ కుమార్తె ఎం. తేజస్విని నందమూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. 'అఖండ 2' సినిమాను 2025 సెప్టెంబర్ 25న థియేటర్లలోకి తీసుకొస్తున్నారు.