మంచు లక్ష్మి కోసం అల్లు అర్జున్

మంచు లక్ష్మి ప్రసన్న ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘దక్ష – ది డెడ్‌లీ కాన్స్పిరసీ’. శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ చిత్రంలో లెజెండరీ యాక్టర్ మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించనుండటం ప్రత్యేక ఆకర్షణ.;

By :  S D R
Update: 2025-09-09 11:27 GMT

మంచు లక్ష్మి ప్రసన్న ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘దక్ష – ది డెడ్‌లీ కాన్స్పిరసీ’. శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ చిత్రంలో లెజెండరీ యాక్టర్ మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించనుండటం ప్రత్యేక ఆకర్షణ.

లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విడుదల చేసి.. చిత్రబృందానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపాడు. ‘లక్ష్మి నా మిత్రురాలు, ఆప్తురాలు. ఆమె, మోహన్ బాబు గారు కలిసి తెరపై కనిపించడం అద్భుతంగా ఉంది. సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను‘ అంటూ బన్నీ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.

ఈ సినిమాలో సముద్రఖని, సిద్దిక్, విశ్వంత్, చిత్రా శుక్లా ఇతర కీలక పాత్రలు పోషిస్తుండగా.. అచు రాజమణి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. సెప్టెంబర్ 19న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతుంది.



Tags:    

Similar News