‘తెలుసు కదా‘ టీజర్ వచ్చేస్తోంది!
స్టార్ బోయ్ సిద్దు జొన్నలగడ్డ నటించిన గత చిత్రం ‘జాక్‘ బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలిసిరాకపోయినా.. ఆ ఫెయిల్యూర్‌ను వెనక్కి నెట్టి కొత్త సినిమాలతో ముందుకు సాగుతున్నాడు.;
స్టార్ బోయ్ సిద్దు జొన్నలగడ్డ నటించిన గత చిత్రం ‘జాక్‘ బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలిసిరాకపోయినా.. ఆ ఫెయిల్యూర్‌ను వెనక్కి నెట్టి కొత్త సినిమాలతో ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం సిద్ధు నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘తెలుసు కదా’. ఈ చిత్రంలో అందాల తారలు రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
స్టైలిష్ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన ఫస్ట్ టైమ్ మెగా ఫోన్ పడుతూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. తమన్ సంగీతంలో ఇప్పటికే విడుదలైన ‘మల్లిక గంధ‘ లిరికల్ సాంగ్ చార్ట్‌బస్టర్ అయ్యింది. ఇక లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి టీజర్ అప్డేట్ అందించింది టీమ్. సెప్టెంబర్ 11న ఉదయం 11:11 గంటలకు టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. అక్టోబర్ 17న తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లో ‘తెలుసు కదా‘ రిలీజ్ కు రెడీ అవుతుంది.