ప్రధానిని కలిసిన విజయ్

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఢిల్లీలో ఒక్కసారిగా ప్రత్యక్షమవడం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణమైంది.;

By :  S D R
Update: 2025-03-29 13:35 GMT

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఢిల్లీలో ఒక్కసారిగా ప్రత్యక్షమవడం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణమైంది. హఠాత్తుగా రాజకీయ నేతల సమక్షంలో ప్రత్యక్షమైన విజయ్, ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవడం సినీ ప్రేమికులనే కాదు, రాజకీయ వర్గాల్లోనూ ఉత్కంఠ రేపింది.

ఇంతకీ విషయామేమిటంటే లేటెస్ట్ గా టి.వి.9 ‘వాట్ ఇండియా థింక్స్ టుడే‘ కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న విజయ్ దేవరకొండ, అక్కడ తన కొత్త సినిమా ‘కింగ్ డమ్‘ హిందీ ట్రైలర్‌ను ప్రదర్శించడంతో పాటు, తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

ఈ కాన్ క్లేవ్ లో విజయ్ లుక్ ఆకట్టుకుంటుంది. తన ‘కింగ్ డమ్‘ లుక్ లో అదరగొట్టాడు రౌడీ స్టార్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ‘కింగ్ డమ్‘ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మే 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Tags:    

Similar News