‘VD12’.. టైటిల్, టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్!
విజయ్ దేవరకొండ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'VD12' గురించి క్రేజీ అప్డేట్ అందించింది టీమ్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ లో గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ మూవీ టైటిల్ రిలీజ్ డేట్ వచ్చేసింది.;
విజయ్ దేవరకొండ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'VD12' గురించి క్రేజీ అప్డేట్ అందించింది టీమ్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ లో గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ మూవీ టైటిల్ రిలీజ్ డేట్ వచ్చేసింది.ఫిబ్రవరి 12న 'VD12' టైటిల్ ను రివీల్ చేస్తూ టీజర్ రిలీజ్ చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది.
పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీ టైటిల్ గురించి తెలియజేస్తూ 'నిశ్శబ్ద కిరీటం రాజు కోసం వేచి చూస్తోంది...' అనే వాక్యంతో పాటు ఒక కిరీటంతో కూడిన అద్భుతమైన డిజైనర్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. 'VD12' టీజర్ అభిమానులు గర్వపడేలా ఉంటుందని విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో తెలిపాడు.
ఈ ఏడాదిలోనే అలరించడానికి సిద్ధమవుతోన్న విజయ్ దేవరకొండ 12వ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఇప్పటికే మేజర్ పార్ట్ చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే నాయికగా నటిస్తుందని తెలుస్తోంది. ఇతర నటీనటుల గురించి తెలియాల్సి ఉంది.