ఇండో-కొరియన్ హంగులతో వరుణ్ తేజ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన 15వ చిత్రంగా ఓ విభిన్నమైన హారర్ కామెడీ కథను ఎంచుకున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇండో-కొరియన్ నేపథ్యంతో వస్తుండడం విశేషం.;
By : S D R
Update: 2025-03-26 06:59 GMT
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన 15వ చిత్రంగా ఓ విభిన్నమైన హారర్ కామెడీ కథను ఎంచుకున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇండో-కొరియన్ నేపథ్యంతో వస్తుండడం విశేషం. ఇప్పటికే ముహూర్తాన్ని జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టుకుంది. ఈ విషయాన్ని ఓ స్పెషల్ ప్రొమో ద్వారా వెల్లడించింది టీమ్.
ఈ ప్రొమోలో వరుణ్ తేజ్, కమెడియన్ సత్య, దర్శకుడు మేర్లపాక గాంధీ ఓ కొరియన్ అమ్మాయితో కలిసి ఫన్ మోడ్ లో కనిపించారు. ఈ ప్రొమో చూస్తే హారర్, కామెడీ అంశాలను సమపాళ్లలో మేళవించి వీరు ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసినట్లు స్పష్టమవుతోంది. ఈ సినిమాలో వరుణ్ కి జోడీగా రితిక నాయక్ నటిస్తుంది. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. యు.వి.క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.