కొత్త సినిమా కోసం కోటి?

తెలుగు చిత్రసీమలో ఇప్పుడు తెలుగమ్మాయిలు కూడా దూసుకెళ్తున్నారు. అలాంటి అరుదైన టాలెంట్‌లో వైష్ణవి చైతన్య ఒకరు. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా కెరీర్ ప్రారంభించిన వైష్ణవి, తొలుత కొన్ని చిత్రాల్లో చిన్న పాత్రలలో మెరిసింది.;

By :  S D R
Update: 2025-03-31 02:43 GMT

తెలుగు చిత్రసీమలో ఇప్పుడు తెలుగమ్మాయిలు కూడా దూసుకెళ్తున్నారు. అలాంటి అరుదైన టాలెంట్‌లో వైష్ణవి చైతన్య ఒకరు. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా కెరీర్ ప్రారంభించిన వైష్ణవి, తొలుత కొన్ని చిత్రాల్లో చిన్న పాత్రలలో మెరిసింది. అయితే ‘బేబి’ సినిమా ఈ అమ్మడికి బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో, వైష్ణవి టాలీవుడ్‌లో డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఒకరిగా మారింది.

ప్రస్తుతం వైష్ణవి ‘జాక్’ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ మూవీలో సిద్ధు జొన్నలగడ్డ సరసన నటించింది. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీలో వైష్ణవి డ్యూయెల్ రోల్ లో మెరవనుందనే ప్రచారం ఉంది. ఏప్రిల్ 10న 'జాక్' విడుదలవుతుంది.

మరోవైపు 'బేబి' హీరో ఆనంద్ దేవరకొండతో '‘90’s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ సీక్వెల్ లోనూ నటిస్తుంది. ప్రస్తుతం వైష్ణవి చైతన్య రెమ్యునరేషన్ ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఓ కొత్త సినిమాకోసం వైష్ణవి కోటి రూపాయలు డిమాండ్ చేసిందట. అందుకు ఆ నిర్మాతలు ఒప్పుకున్నారనేది ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న కథనం.

Tags:    

Similar News