‘వీరమల్లు‘ కోసం త్రివిక్రమ్
పవన్ కళ్యాణ్ పీరియడ్ డ్రామా ‘హరిహర ర మల్లు’ ఎట్టకేలకు చివరిదశకు చేరుకుంది. అనేక ఆటంకాలు, మార్పులు, ఆలస్యాల అనంతరం, ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతుంది.;
పవన్ కళ్యాణ్ పీరియడ్ డ్రామా ‘హరిహర ర మల్లు’ ఎట్టకేలకు చివరిదశకు చేరుకుంది. అనేక ఆటంకాలు, మార్పులు, ఆలస్యాల అనంతరం, ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతుంది. మే నెల చివరిలో లేదా జూన్ లో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.
ఆసక్తికర అంశం ఏమిటంటే, ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్‌తో ఎలాంటి సంబంధం లేని త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు ‘వీరమల్లు‘ కోసం రంగంలోకి దిగుతున్నాడట. పవన్ కళ్యాణ్ తో ఎంతో స్నేహబంధం ఉన్న త్రివిక్రమ్.. ఆయన సూచన ప్రకారం ‘హరిహర వీరమల్లు‘ అవుట్ పుట్ ను పరిశీలించనున్నాడట.
ముఖ్యంగా ‘వీరమల్లు‘ ఎడిటింగ్ ను త్రివిక్రమ్ పరిశీలించి.. ఏమైనా మార్పులు ఉంటే చెప్పనున్నట్టు తెలుస్తోంది. తొలుత క్రిష్ దర్శకత్వం వహించిన ‘వీరమల్లు‘ కోసం ఆ తర్వాత జ్యోతికృష్ణ దర్శకుడిగా వచ్చాడు. మొత్తంగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇన్ పుట్స్ ‘వీరమల్లు‘కి ఎలాంటి ప్లస్ అవుతాయో చూడాలి.