‘జాట్‘ నుంచి ‘టచ్ కియా‘
బాలీవుడ్ యాక్షన్ స్టార్ సన్నీ డియోల్ హీరోగా నటించిన ‘జాట్‘పై అంచనాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. మలినేని గోపీచంద్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 10న విడుదలకు ముస్తాబవుతుంది.;
By : S D R
Update: 2025-04-02 07:51 GMT
బాలీవుడ్ యాక్షన్ స్టార్ సన్నీ డియోల్ హీరోగా నటించిన ‘జాట్‘పై అంచనాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. మలినేని గోపీచంద్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 10న విడుదలకు ముస్తాబవుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ దక్కింది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ‘టచ్ కియా‘ రిలీజ్ చేశారు.
తమన్ సంగీతంలో రూపొందిన ఈ మాస్ బీట్ నంబర్ లో ఊర్వశి రౌతేలా సిజ్లింగ్ డ్యాన్సులతో అదరగొట్టింది. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాలో రణదీప్ హుడా, రెజీనా కసాండ్రా, సయామీ ఖేర్, జగపతి బాబు, రమ్యకృష్ణ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు.