అంతరిక్షంలో టామ్ క్రూజ్ పెళ్ళి?

Update: 2025-10-02 04:50 GMT

హాలీవుడ్ యాక్షన్ స్టార్ టామ్ క్రూజ్ ఎప్పుడూ అదిరిపోయే యాక్షన్‌ను తెరపై చూపించడానికి అనేక ప్రమాదకర స్టంట్‌లు చేస్తుంటాడు. ఇప్పుడు.. ఈ నటుడు తన ప్రియురాలు, పాపులర్ నటి అనా డి అర్మాస్‌తో కలిసి తమ వివాహ వేడుకను చాలా కాలం గుర్తుండిపోయేలా చేసేందుకు ఓ విభిన్నమైన, అబ్బురపరిచే ప్లాన్‌తో ఉన్నాడు.

టామ్ క్రూజ్, అనా డి అర్మాస్ తమ పెళ్లిని స్కూబా డైవింగ్‌తో నీటి అడుగున, అంతరిక్షంలో, లేదా స్కైడైవింగ్ చేస్తూ గాలిలో నిర్వహించాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పెళ్లి చివరికి అంతరిక్షంలో జరిగితే.. అది శూన్యంలో జరిగిన మొదటి వివాహం అవుతుంది. ఈ స్టార్ కపుల్ తమ వివాహాన్ని సంప్రదాయానికి భిన్నంగా, చరిత్రలో నిలిచిపోయేలా చేసుకోవాలని నిర్ణయించుకున్నారట.

టామ్ క్రూజ్, అనా డి అర్మాస్ ఈ ఏడాది జూలైలో వెర్మాంట్‌లో తొలిసారిగా కలిసి కనిపించారు. హాలీవుడ్ స్టార్ బెన్ అఫ్లెక్ట్‌తో బ్రేకప్ అయినప్పటి నుండి అనా, టామ్‌తో డేటింగ్ చేస్తోంది. టామ్‌కు ఇది నాల్గవ వివాహం కానుంది. గతంలో ఆయన ప్రముఖ హాలీవుడ్ నటీమణులు మిమీ రోజర్స్, నికోల్ కిడ్‌మన్, మరియు కేటీ హోమ్స్‌లను పెళ్లాడారు.

Tags:    

Similar News