‘రాజు గారి గది 4‘ అనౌన్స్ మెంట్

టాలీవుడ్‌లో హిట్ ఫ్రాంఛైజీలలో ఒకటైన ‘రాజు గారి గది‘ సిరీస్‌లో మరో కొత్త అధ్యాయం మొదలుకానుంది. ఓంకార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుండటం విశేషం.;

By :  S D R
Update: 2025-10-02 07:38 GMT

టాలీవుడ్‌లో హిట్ ఫ్రాంఛైజీలలో ఒకటైన ‘రాజు గారి గది‘ సిరీస్‌లో మరో కొత్త అధ్యాయం మొదలుకానుంది. ఓంకార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుండటం విశేషం. ‘రాజు గారి గది 4: శ్రీచక్రం’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది దసరా కానుకగా విడుదల చేయబోతున్నారు.

ఎర్ర చీరలో ఒక మహిళ గాల్లో తేలుతూ, వెనుక కాళీదేవి విగ్రహం దర్శనమిస్తున్నట్టుగా ఉన్న ‘రాజు గారి గది 4‘ అనౌన్స్ మెంట్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. ‘A Divine Horror Begins‘ అనే అనౌన్స్ మెంట్ తో ఈ మూవీ హారర్ బ్యాక్ డ్రాప్ లో మైథలాజికల్ టచ్ తో రాబోతున్నట్టు హింట్ ఇచ్చింది టీమ్.



Tags:    

Similar News