శ్రీవిష్ణు కొత్త చిత్రం ప్రారంభం

శ్రీవిష్ణు హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన ‘సామజవరగమణ‘ ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఇదే కాంబినేషన్ మరోసారి రిపీటవుతోంది.;

By :  S D R
Update: 2025-10-02 09:31 GMT

శ్రీవిష్ణు హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన ‘సామజవరగమణ‘ ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఇదే కాంబినేషన్ మరోసారి రిపీటవుతోంది. దసరా సందర్భంగా వీరిద్దరి కలయికలో కొత్త సినిమా ముహూర్తాన్ని జరుపుకుంది.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను ‘Sree Vishnu x Ram Abbaraju 2’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందిస్తున్నారు. ఈ సినిమా ముహూర్తపు వేడుకకు సాయి ధరమ్ తేజ్, నారా రోహిత్, నరేష్, వెన్నెల కిషోర్, సుదర్శన్, వివేక్ ఆత్రేయ, హసిత్ గొలి వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఈ చిత్రానికి కథను భాను భోగవరపు అందిస్తున్నాడు. ‘సామజవరగమన‘ తరహాలోనే ఈ సినిమా కూడా ఫుల్ లెన్త్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనుందట.



Tags:    

Similar News