‘సంబరాల ఏటిగట్టు‘ నుంచి అప్డేట్

‘విరూపాక్ష, బ్రో’ విజయాల తరువాత, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ సినిమాతో రాబోతున్నాడు. సాయితేజ్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది.;

By :  S D R
Update: 2025-10-02 05:44 GMT

‘విరూపాక్ష, బ్రో’ విజయాల తరువాత, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ సినిమాతో రాబోతున్నాడు. సాయితేజ్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాకోసం సిక్స్ ప్యాక్ బాడీతో సరికొత్తగా మేకోవర్ అయ్యాడు సాయితేజ్. ముఖ్యంగా ఈ చిత్రంలోని యాక్షన్ సీక్వెన్సెస్ ఎంతో డిఫరెంట్ గా ఉండబోతున్నాయనే అంచనాలున్నాయి.

‘హనుమాన్’ నిర్మాతలు కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. డెబ్యూ డైరెక్టర్ రోహిత్ కెపి తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తుండగా.. జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అజనీష్ లోక్ నాథ్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్. పాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్న ఈ మూవీ గ్లింప్స్ ను అక్టోబర్ 15న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఓ స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేసింది టీమ్.



Tags:    

Similar News