అల్లు వారి ఇంట పెళ్లిసందడి
అల్లు కుటుంబంలో శుభకార్యం జరగబోతుంది. యువ హీరో, అల్లు అరవింద్ మూడో కుమారుడు అల్లు శిరీష్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడు.;
అల్లు కుటుంబంలో శుభకార్యం జరగబోతుంది. యువ హీరో, అల్లు అరవింద్ మూడో కుమారుడు అల్లు శిరీష్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడు. తన ఎంగేజ్‌మెంట్ అక్టోబర్ 31న జరగనుందని స్వయంగా అల్లు శిరీష్ వెల్లడించాడు.
శిరీష్ తన సోషల్ మీడియా పోస్టులో ఈ విషయాన్ని తెలిపాడు. ‘మా తాత అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా నా హృదయానికి చాలా దగ్గరగా ఉన్న విషయాన్ని మీతో పంచుకుంటున్నా. నయనికతో నా నిశ్చితార్థం జరగనుంది.‘ అని పోస్ట్ పెట్టాడు శిరీష్.
ఈ పోస్ట్ లో ఫ్రాన్స్‌లోని ఈఫిల్ టవర్ వద్ద తన కాబోయే భార్య నయనిక చేతిని పట్టుకుని దిగిన ఫొటోను కూడా షేర్ చేశాడు. నయనిక హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త కుమార్తె అని సమాచారం. సినిమా కెరీర్ విషయానికి వస్తే ‘గౌరవం’తో హీరోగా పరిచయమైన శిరీష్, ‘కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ‘ఏబీసీడీ’, బడ్డీ’ వంటి చిత్రాలను చేశాడు. టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకడిగా ఉన్న అల్లు శిరీష్ పెళ్లి వార్తను పంచుకోవడంతో అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.