పెళ్లి చేసుకున్న చిన్నారి పెళ్లికూతురు
‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి అవికా గోర్. ఈ బ్యూటీ ఇప్పుడు కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. కొన్నేళ్లుగా తాను ప్రేమలో ఉన్న సామాజిక కార్యకర్త మిలింద్ చంద్వానిని వివాహం చేసుకుంది.;
‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి అవికా గోర్. ఈ బ్యూటీ ఇప్పుడు కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. కొన్నేళ్లుగా తాను ప్రేమలో ఉన్న సామాజిక కార్యకర్త మిలింద్ చంద్వానిని వివాహం చేసుకుంది. జూన్‌లో నిశ్చితార్థం జరిగిన ఈ జంట, కుటుంబ సభ్యుల ఆశీర్వాదాలతో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
2019లో ఓ సామాజిక కార్యక్రమంలో పరిచయమైన వీరిద్దరూ, మొదట స్నేహితులుగా ఉండి 2020 నుంచి ప్రేమను మొదలుపెట్టారు. దాదాపు ఐదేళ్ల ప్రేమాయణం అనంతరం పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం అవికా, మిలింద్ 'పతీ, పత్ని ఔర్ పంగా' అనే రియాలిటీ షోలో పాల్గొంటున్నారు. ఈ షో సెట్స్‌లోనే వీరి వివాహ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు.
పెళ్లి సందర్భంగా అవికా రెడ్ కలర్ లెహంగా, పచ్చల ఆభరణాలతో అచ్చం రాణిలా మెరిసింది. మిలింద్ గోల్డ్ కలర్ షేర్వాణీలో ఆకట్టుకున్నాడు. సింపుల్‌గా జరిగిన ఈ వేడుకకి సంబంధించి ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినీ ప్రముఖులు, అభిమానులు కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
సీరియల్ నటి నుంచి హీరోయిన్‌గా మారిన అవికా, తెలుగులో ‘ఉయ్యాలా జంపాలా’తో ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టింది. ఆ తర్వాత ‘సినిమా చూపిస్త మామ, లక్ష్మీ రావే మా ఇంటికి, ఎక్కడికి పోతావ్ చిన్నవాడా, రాజుగారి గది 3, థ్యాంక్యూ' వంటి సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ప్రస్తుతం ‘షణ్ముఖ్’ చిత్రంతో బిజీగా ఉంది.