‘మహాకాళి’లో శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా
టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన సినిమాటిక్ యూనివర్శ్ సృష్టించుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఈ యంగ్ డైరెక్టర్ సృష్టించిన ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోతున్న చిత్రం ‘మహాకాళి‘.;
టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన సినిమాటిక్ యూనివర్శ్ సృష్టించుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఈ యంగ్ డైరెక్టర్ సృష్టించిన ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోతున్న చిత్రం ‘మహాకాళి‘. లేడీ సూపర్ హీరో కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ మూవీకి పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తుండగా, ప్రశాంత్ వర్మ కథ అందించారు.
‘ఛావా‘ సినిమాలో ఔరంగజేబు పాత్రతో మంచి గుర్తింపు పొందిన బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ ఖన్నా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. లేటెస్ట్ గా ‘మహాకాళి‘ నుంచి అక్షయ్ లుక్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో సినిమాలో అసురుల గురువు శుక్రాచార్యుడి పాత్రలో అక్షయ్ భయానకమైన కొత్త లుక్‌లో ఆకట్టుకుంటున్నాడు. ‘మహాకాళి‘ కథ అంతా బెంగాల్ నేపథ్యంలో సాగనుందట. ఈ చిత్రాన్ని ఐమాక్స్, 3D ఫార్మాట్ లలో పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కు రెడీ చేస్తున్నారు.