ఉమెన్స్ డే స్పెషల్ మెగా ఇంటర్యూ!

Update: 2025-03-07 14:15 GMT

రేపు (మార్చి 8) మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా ఉమెన్స్ డే స్పెషల్ ఇంటర్యూ విత్ మెగా ఉమెన్ అంటూ ఓ స్పెషల్ ఇంటర్యూ రాబోతుంది. తల్లి అంజనమ్మతో మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు.. మెగా సిస్టర్స్ విజయ, మాధవి తమ అనుబంధాన్ని పంచుకున్న ఇంటర్యూ ఇది.



ఇప్పటివరకూ బయట ఎక్కువగా వినిపించని మెగా సిస్టర్స్ విజయ, మాధవి తమ తల్లి గురించి, కుటుంబం గురించి పలు ఆసక్తికర విశేషాలను ఈ ఇంటర్యూలో పంచుకున్నట్టు తెలుస్తోంది. చిరంజీవి, నాగబాబు తమ తల్లితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న విశేషాలూ ఉన్నాయి. రేపు విడుదల కానున్న ఈ ఇంటర్యూ ప్రోమో విడుదలైంది.

Tags:    

Similar News