బుల్లితెరపై మళ్లీ రోజా రాజ్యం మొదలవుతుందా?

By :  T70mm Team
Update: 2025-02-25 12:20 GMT

ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా టాలీవుడ్, కోలీవుడ్‌లో రాణించిన రోజా.. ఆ తర్వాత బుల్లితెరపైనా దుమ్మురేపింది. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి పాపులర్ షోలలో జడ్జిగా ఎంతో బిజీ అయ్యింది. ఇక రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత బుల్లితెరకు దూరమయ్యింది. వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత టీవీ షోలకి గుడ్‌బై చెప్పేసింది.

అయితే గత ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రోజా ఓడిపోయింది. ఈనేపథ్యంలో మళ్లీ ఆమె బుల్లితెర రీఎంట్రీకి సిద్ధమైంది. జీ తెలుగు సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ సీజన్ 4 షోలో జడ్జిగా కనిపించబోతుంది. ఈ షోలో హీరో శ్రీకాంత్, హీరోయిన్ రాశి, దర్శకుడు అనిల్ రావిపూడి, బాలనటుడు రేవంత్ (బుల్లిరాజు) కూడా పాల్గొనబోతున్నారు. ఈ షోకు సంబంధించిన ప్రోమో లేటెస్ట్ గా రిలీజయ్యింది. మార్చి 2 నుంచి ఈ షో ప్రారంభం కానుంది.

మరోవైపు సినిమాల్లో నటించడానికి సైతం తాను సిద్ధమే అన్నట్టు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రోజా. మరి.. ఒకప్పుడు జబర్దస్త్ జడ్జ్ గా బుల్లితెరను ఏలిన రోజా.. ఇప్పుడు మళ్లీ అదే దూకుడు కొనసాగిస్తుందా? లేదా? అనేది చూడాలి.

Tags:    

Similar News