మెగాస్టార్ ‘విశ్వంభర’ విడుదల ఎప్పుడు?

విఎఫ్ఎక్స్ వర్క్ ఇంకా పూర్తి కాకపోవడం వల్ల ఆ తేదీకి విడుదల చేయలేకపోయారు. తర్వాత మేలో రిలీజ్ చేస్తారనే వార్తలొచ్చాయి. ఇప్పుడు తాజా వార్తల ప్రకారం.. సెప్టెంబర్ 25న సినిమా విడుదల కావొచ్చని అంటున్నారు.;

By :  K R K
Update: 2025-05-01 01:10 GMT

మెగాస్టార్ చిరంజీవి, వశిష్ట కాంబినేషన్ లోని "విశ్వంభర" సినిమా మొదట ఈ సంక్రాంతికి విడుదల వుతుందని అఫిషియల్ గా ప్రకటించారు. అయితే విఎఫ్ఎక్స్ వర్క్ ఇంకా పూర్తి కాకపోవడం వల్ల ఆ తేదీకి విడుదల చేయలేకపోయారు. తర్వాత మేలో రిలీజ్ చేస్తారనే వార్తలొచ్చాయి. ఇప్పుడు తాజా వార్తల ప్రకారం.. సెప్టెంబర్ 25న సినిమా విడుదల కావొచ్చని అంటున్నారు. కానీ ఇంకా అధికారికంగా ఏమైనా ప్రకటించలేదు.

విశ్వంభర చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. కునాల్ కపూర్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. సంగీతాన్ని ఎంఎం కీరవాణి అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన వీడియోలపై కొన్ని విమర్శలు వచ్చినందున, వీఎఫ్ఎక్స్ పనుల్లో జాగ్రత్తలు తీసుకుంటూ, మరింత బాగా చేయడానికి సమయం తీసుకుంటున్నారు.

ఇదిలా ఉండగా, చిరంజీవి తర్వాతి సినిమా కూడా ముందే ప్రిపేర్ అవుతోంది. ఈసారి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. నయనతార, జ్యోతిక పేర్లు హీరోయిన్‌గా వినిపిస్తున్నాయి. అదీ కాకుండా చిరంజీవి క్లాసిక్ మూవీ "జగదేక వీరుడు అత్తిలోక సుందరి" మే 9 న మళ్లీ థియేటర్లలో విడుదల కాబోతోంది. అంతా చూస్తుంటే… సినిమా ఆలస్యం అయినా చిరంజీవి ఫ్యాన్స్‌కు ఎక్కడా గ్యాప్ లేకుండా ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ప్లాన్‌తోనే ఉన్నారు. 

Tags:    

Similar News