తక్కువ బడ్జెట్ తో లాగించేస్తారట !
నిర్మాతలు విజువల్స్, కాస్టింగ్ అండ్ ప్రమోషన్స్‌లో ఖర్చులను తగ్గించేందుకు నిర్ణయించారు. నాణ్యతను కాపాడుతూనే అనవసర ఖర్చులను నివారించాలని వారి లక్ష్యం. బడ్జెట్ మొదటి ప్లాన్ కంటే చాలా తక్కువగా ఉంటుంది.;
విజయ్ దేవరకొండ "కింగ్‌డమ్" విజయం తర్వాత డైరెక్టర్ రాహుల్ సంకృత్యాయన్‌తో తన తదుపరి ప్రాజెక్ట్ కోసం కలిసి పనిచేస్తున్నాడు. రాహుల్ స్క్రిప్ట్‌ను మెరుగుపరుస్తూ... కథ, టీమ్ బాగుంటే విజయ్ మరో హిట్ ఇవ్వగలడని నమ్ముతున్నాడు. "శ్యామ్ సింగ రాయ్" సినిమా లాంటి విజువల్స్, ఎమోషన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమా కూడా ఉండాలని ఆశిస్తున్నారు.
త్వరలోనే ఈ మూవీ టైటిల్, కథ గురించి అధికారిక ప్రకటన వస్తుందని అంచనా. మొదట ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తీయాలని ప్లాన్ చేశారు. కానీ, ఇటీవలి నాన్-థియేట్రికల్ బిజినెస్ నంబర్స్ చూసిన తర్వాత.. అంత ఖర్చు పెట్టడం రిస్కీ అని టీమ్ భావించింది. "కింగ్‌డమ్" బాక్సాఫీస్ వద్ద సాధారణ విజయం సాధించినప్పటికీ, నాన్-థియేట్రికల్ సేల్స్‌లో అంచనాలను అందుకోలేదు.
దీంతో నిర్మాతలు విజువల్స్, కాస్టింగ్ అండ్ ప్రమోషన్స్‌లో ఖర్చులను తగ్గించేందుకు నిర్ణయించారు. నాణ్యతను కాపాడుతూనే అనవసర ఖర్చులను నివారించాలని వారి లక్ష్యం. బడ్జెట్ మొదటి ప్లాన్ కంటే చాలా తక్కువగా ఉంటుంది. ఈ మార్పు అధికారిక ప్రకటనలో నిర్ధారణ అవుతుందో లేదో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.