‘పరదా’ వెనుక కథ
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో, ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో తెరకెక్కిన గ్రామీణ నేపథ్య చిత్రం ‘పరదా’. ఈ సినిమాలో సంగీత, దర్శనా రాజేంద్రన్, గౌతమ్ మీనన్ కీలక పాత్రల్లో నటించారు.;
By : S D R
Update: 2025-08-09 14:31 GMT
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో, ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో తెరకెక్కిన గ్రామీణ నేపథ్య చిత్రం ‘పరదా’. ఈ సినిమాలో సంగీత, దర్శనా రాజేంద్రన్, గౌతమ్ మీనన్ కీలక పాత్రల్లో నటించారు. ఆగస్టు 22న విడుదల కానున్న ‘పరదా‘ మూవీ నుంచి ట్రైలర్ రిలీజయ్యింది.
ఒక గ్రామంలోని కఠినమైన సంప్రదాయాలు, దురాచారాల కారణంగా ఆడవారికి ఎదురయ్యే అన్యాయం, వాటిని ఎదుర్కొనే ‘సుబ్బు’ (అనుపమ) పోరాటమే ఈ సినిమా కథగా ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. ట్రైలర్‌లో ఉత్కంఠభరిత సన్నివేశాలు, నాటకీయ మలుపులు సినిమాపై ఆసక్తి పెంచుతున్నాయి. బలమైన మహిళా సాధికారత సందేశంతో కూడిన ఈ చిత్రానికి గోపీ సుందర్ అందించిన సంగీతం, టెక్నికల్ టీమ్ సపోర్ట్ ప్లస్ పాయింట్‌గా కనిపిస్తున్నాయి.