‘స్పిరిట్’ లో కూడా ఉపేంద్ర లిమయే?

ఉపేంద్ర లిమాయే ఒక్క సరైన టైమింగ్‌తో చేసిన మీటింగ్, ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో ఫ్యాన్స్‌ని ఖుషీ చేశాడు. ఇప్పుడు ఆ పోస్ట్‌ని ఫ్యాన్స్ ఫ్రేమ్ బై ఫ్రేమ్ డీకోడ్ చేస్తూ.. ‘స్పిరిట్’ కేస్టింగ్ గురించి తెగ ఊహాగానాలు చేస్తున్నారు.;

By :  K R K
Update: 2025-06-20 00:45 GMT

ఒక్క కాజువల్ ఫోటో.. దానికి జోడించిన క్రిప్టిక్ క్యాప్షన్. అంతే, సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అయిపోయింది. ప్రభాస్ లేటెస్ట్ బిగ్ బడ్జెట్ మూవీ ‘స్పిరిట్’ చుట్టూ హైప్ రాకెట్ స్పీడ్‌లో పెరిగిపోతోంది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రీ-ప్రొడక్షన్‌లో ఫుల్ బిజీగా ఉంటే, నటుడు ఉపేంద్ర లిమాయే ఒక్క సరైన టైమింగ్‌తో చేసిన మీటింగ్, ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో ఫ్యాన్స్‌ని ఖుషీ చేశాడు. ఇప్పుడు ఆ పోస్ట్‌ని ఫ్యాన్స్ ఫ్రేమ్ బై ఫ్రేమ్ డీకోడ్ చేస్తూ.. ‘స్పిరిట్’ కేస్టింగ్ గురించి తెగ ఊహాగానాలు చేస్తున్నారు.

‘యానిమల్’ మూవీలో ఫ్రెడ్డీ, ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీలో జార్జ్ ఆంటోనీ లాంటి షో-స్టీలింగ్ రోల్స్‌తో రీసెంట్‌గా మెప్పించిన ఉపేంద్ర లిమాయే.. హైదరాబాద్‌లో భద్రకాళీ పిక్చర్స్‌లో దర్శకుడు సందీప్‌ రెడ్డిని కలిశాడు. “రెడ్డి బ్రదర్స్ హై ‘స్పిరిట్స్ లో ఉన్నారు...” అని క్యాప్షన్‌తో ఫోటో షేర్ చేసి.. ‘స్పిరిట్’ కాస్ట్‌లో చేరుతున్నాడనే టాక్‌కి ఆజ్యం పోశాడు. బోల్డ్, లేయర్డ్ రోల్స్‌లో రాణిస్తున్న లిమాయే ట్రాక్ రికార్డ్‌తో ఈ కాంబో ఇంట్రెస్టింగ్‌గా కనిపిస్తోంది.

లిమాయే రీసెంట్ రోల్స్ బాక్సాఫీస్ వద్ద బాగా పేలుతుండడంతో... అతడి ఎంట్రీ సందీప్ అంబిషియస్ ప్రాజెక్ట్‌పై అంచనాలను మరింత పెంచుతోంది. సందీప్ అతడి కోసం ఎలాంటి క్యారెక్టర్ ప్లాన్ చేశాడనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్. తృప్తి డిమ్రి ఇప్పటికే ఫీమేల్ లీడ్‌గా ఫైనలైజ్ అయింది. టి-సిరీస్, భద్రకాళీ పిక్చర్స్ బ్యాకింగ్‌తో, హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్‌తో ‘స్పిరిట్’ మూవీ మాసివ్ వెంచర్‌గా తయారవుతోంది. 

Tags:    

Similar News