హైదరాబాద్ లోనే 'వీరమల్లు' ప్రీ రిలీజ్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ప్రతిష్టాత్మక పీరియాడికల్ డ్రామా ‘హరిహర వీరమల్లు’.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ప్రతిష్టాత్మక పీరియాడికల్ డ్రామా ‘హరిహర వీరమల్లు’. భారీ బడ్జెట్‌తో మెగా సూర్య ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని జ్యోతి కృష్ణ – క్రిష్ జాగర్లమూడి సంయుక్తంగా తెరకెక్కించారు. పలు వాయిదాల తర్వాత ఈ సినిమా జూలై 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రిలీజ్ కు కేవలం వారం రోజులు మాత్రమే ఉండటంతో.. ఇకపై ప్రచారంలో స్పీడు పెంచబోతున్నారు మేకర్స్.
ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జూలై 21న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించనున్నారు. మొదట విశాఖపట్నంలో ప్లాన్ చేసిన ఈ వేడుకను అనివార్య కారణాలతో చివరకు హైదరాబాద్‌కు మార్చారు. ఈ ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్ హాజరవుతున్నట్లుగా ఇప్పటికే తెలుస్తుండగా, ముఖ్య అతిథులుగా పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు వస్తారని తెలుస్తోంది.
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్‌కు ఎదురుగా పోరాడే వీరుడిగా కనిపించనుండగా, ఆయన సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్, కోట శ్రీనివాసరావు, సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటించారు. ఆస్కార్ విజేత కీరవాణి సంగీతాన్ని సమకూర్చాడు.