అనుష్క వెర్సెస్ రష్మిక మందన్న !

అనుష్క శెట్టి, రష్మిక మందన్న.. విభిన్నమైన జర్నీలతో ఉన్న ఈ ఇద్దరు నటీమణులు తమ ఫీమేల్-లెడ్ సినిమాలతో ఢీ కొట్టబోతున్నారు.;

By :  K R K
Update: 2025-07-17 12:24 GMT

ఈ సెప్టెంబర్ 5న టాలీవుడ్‌లో ఒక ఆసక్తికరమైన బాక్సాఫీస్ వార్ జరగబోతోంది. అనుష్క శెట్టి, రష్మిక మందన్న.. విభిన్నమైన జర్నీలతో ఉన్న ఈ ఇద్దరు నటీమణులు తమ ఫీమేల్-లెడ్ సినిమాలతో ఢీ కొట్టబోతున్నారు. ఒకే రోజు ఇలాంటి రెండు ప్రాజెక్ట్‌లు రిలీజ్ కావడం అరుదు. ఇప్పటికే ఫ్యాన్స్ ఆన్‌లైన్‌లో దీన్ని ట్రెండ్ చేస్తున్నారు.

అనుష్క నటించిన ‘ఘాటి’.. క్రిష్ డైరెక్షన్‌లో వస్తోన్న డార్క్, ఇంటెన్స్ డ్రామా. పోస్టర్స్ నుంచే వైలెంట్, రస్టిక్ వైబ్ కనిపిస్తోంది. దీంతో అంచనాలు భారీగా పెరిగాయి. మొదట ఏప్రిల్‌లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడి.. ఇప్పుడు సెప్టెంబర్ 5న రాబోతోంది. దీని పెర్ఫామెన్స్‌పై అందరి దృష్టి ఉంది. మరోవైపు.. రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా కూడా అదే రోజున రాబోతోంది. రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్‌లో.. రూపొందిన ఈ ప్రాజెక్ట్ రష్మికకు మొదటి పూర్తి స్థాయి ఫీమేల్ లీడ్ రోల్ మూవీ.

కానీ ఈ సినిమా గురించి ఇంకా పెద్దగా బజ్ లేదు. రష్మిక ఉన్నదనే ఒక్క కారణంతోనే దీనికి మంచి క్రేజ్ దక్కుతోంది. అందుకే ‘ఘాటి’ తో పోలికలు మొదలయ్యాయి. రష్మిక పెరుగుతున్న పాపులారిటీ.. అనుష్క యూత్‌లో ఉన్న బలమైన ఫాలోయింగ్‌తో ఢీ కొట్టగలదా అనేది ఇప్పుడు చర్చ. ‘ఘాటి’ మూవీకి కంటెంట్, టీమ్ బలంగా ఉన్నాయి. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ఇంకా రహస్యంగానే ఉంది. ఒకవేళ ఈ రెండు సినిమాలూ ఒకే రోజు రిలీజ్ అయితే.. స్టార్ పవర్, కంటెంట్, క్రౌడ్ పుల్లింగ్ లో ఎవరిది పైచేయి అనేది ఆసక్తిగా మారుతుంది. 

Tags:    

Similar News