ఆకట్టుకుంటున్న 'సార్ మేడమ్' ట్రైలర్!
తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, జాతీయ ఉత్తమ నటి నిత్యామీనన్ కలయికలో రూపొందిన చిత్రం 'సార్ మేడమ్'.;
By : S D R
Update: 2025-07-17 13:30 GMT
తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, జాతీయ ఉత్తమ నటి నిత్యామీనన్ కలయికలో రూపొందిన చిత్రం 'సార్ మేడమ్'.తమిళంలో పల్లెటూరి కథాంశాలు తెరకెక్కించడంలో పాండిరాజ్ ది ప్రత్యేకమైన శైలి. ఇప్పుడు 'సార్ మేడమ్'తో మరో రూరల్ స్టోరీని ఆవిష్కరించాడు పాండిరాజ్. జూలై 25న విడుదలకు ముస్తాబవుతోన్న 'సార్ మేడమ్' ట్రైలర్ రిలీజయ్యింది.
ఈ సినిమాలో విజయ్ సేతుపతి ఒక పరోటా మాస్టర్ పాత్రలో కనిపించబోతుండగా, అతని భార్యగా నిత్యామీనన్ కనిపించనుంది. ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న ఈ జంట మధ్య జరిగే గొడవలు, అవి చివరకు ఎంత వరకూ వెళ్లాయి అనేది ఈ చిత్రంలో చూపించినట్టు ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. తమిళ రూరల్ స్టైల్ లో ట్రైలర్ ఆద్యంతం ఎంతో నేచురల్ గా ఆకట్టుకుంటుంది.