టైమ్ మిషన్ రీ-స్టార్ట్ – 4Kలో ‘ఆదిత్య 369‘!

By :  T70mm Team
Update: 2025-02-26 07:22 GMT


నటసింహ బాలకృష్ణ నటించిన చిత్రాల్లో 'ఆదిత్య 369' ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది. సింగీత శ్రీనివాసరావు దర్శకత్వంలో టైమ్‌ మెషీన్ బ్యాక్‌డ్రాప్‌లో సైన్స్‌ ఫిక్షన్ కథాంశంతో సాగే ఈ సినిమా 1991లో విడుదలై ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో శ్రీకృష్ణదేవరాయలుగా, కృష్ణకుమార్‌గా రెండు పాత్రల్లో ద్విపాత్రాభినయంతో అదరగొట్టాడు బాలయ్య. ఈ సినిమా స్ఫూర్తితోనే ప్రభాస్ ‘కల్కి‘ కూడా రూపొందింది.

ఇక 'ఆదిత్య 369' చిత్రానికి సీక్వెల్ గా 'ఆదిత్య 999'ని తీసుకొస్తానని బాలకృష్ణ చాలా రోజుల క్రితమే ప్రకటించారు. సీక్వెల్ లో బాలయ్యతో పాటు ఆయన తనయుడు మోక్షఙ్ఞ కూడా నటించనున్నాడనే ప్రచారం ఉంది. ఇదిలావుంటే ఇప్పుడు ‘ఆదిత్య 369‘ మరోసారి థియేటర్లలోకి రాబోతుంది. ఈసారి 4కె వెర్షన్ లో బిగ్ స్క్రీన్ పై సందడి చేయబోతుంది. ఈ వేసవి బరిలో ‘ఆదిత్య 369‘ని థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. ఈరోజు మహాశివరాత్రి శుభాకాంక్షలతో ‘ఆదిత్య 369‘ రీ రిలీజవుతోన్న సంగతిని తెలియజేసింది టీమ్.

Tags:    

Similar News