ఈ రెండు సినిమాలపైనే హోప్ !
సాధారణంగా వేసవి సెలవుల కాలంలో టాప్ స్టార్లు, మిడ్‌రేంజ్ స్టార్లతో కూడిన కనీసం అరడజను పెద్ద సినిమాలు, మరో డజను చిన్న బడ్జెట్ చిత్రాలు థియేటర్లలో సందడి చేస్తుంటాయి. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా మారింది.;
2025 సమ్మర్ సీజన్ తెలుగు సినిమా పరిశ్రమకు నిరాశను మిగిల్చింది. సాధారణంగా వేసవి సెలవుల కాలంలో టాప్ స్టార్లు, మిడ్‌రేంజ్ స్టార్లతో కూడిన కనీసం అరడజను పెద్ద సినిమాలు, మరో డజను చిన్న బడ్జెట్ చిత్రాలు థియేటర్లలో సందడి చేస్తుంటాయి. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా మారింది.
ఈ సీజన్‌ను నితిన్ నటించిన "రాబిన్ హుడ్" చిత్రం ప్రారంభించింది. అయితే.. ఈ సినిమా ఘోరంగా పరాజయమైంది. ఏప్రిల్ నెలలో సిద్ధు జొన్నలగడ్డ, కళ్యాణ్ రామ్ నటించిన రెండు మిడ్‌రేంజ్ సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి. ఇవి కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేకపోయాయి.
ఇంక మే నెలలోనూ విడుదలలు చాలా తక్కువగా ఉన్నాయి. మిడ్‌రేంజ్ స్టార్ నాని "హిట్ 3" తో మే నెలను ప్రారంభించనున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయ్. ఓపెనింగ్స్ కూడా శక్తివంతంగా ఉండే అవకాశముంది. అలాగే.. మే నెల చివర్లో విజయ్ దేవరకొండ నటించిన "కింగ్‌డమ్" రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి ప్రస్తుతం పెద్దగా హైప్ లేక పోయినప్పటికీ, విజయ్‌కు ఉన్న యూత్ ఫాలోయింగ్ వల్ల ఓ మోతాదులో క్రేజ్ ఏర్పడింది.
ఈ రెండు పెద్ద సినిమాల మద్య కాలంలో శ్రీ విష్ణు నటించిన "సింగిల్," సమంత నిర్మించిన "శుభం" వంటి చిన్న బడ్జెట్ సినిమాలు మాత్రమే ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేయనున్నాయి. రవి తేజ నటించిన "మాస్ జాతర," చిరంజీవి నటించిన "విశంభర" సినిమాలు మేలో విడుదల కావాల్సి ఉన్నా, వాయిదా పడ్డాయి.
పైగా పవన్ కళ్యాణ్ నటించిన "హరి హర వీర మల్లు" సినిమా కూడా మే 9న విడుదల కావాల్సి ఉండగా, అది కూడా మళ్లీ వాయిదా పడింది. ఇప్పటివరకు ఈ సినిమాకు కొత్త విడుదల తేదీపై స్పష్టత లేదు. జూన్ 10న వేసవి సెలవులు ముగిసేలోపు పవన్ సినిమా విడుదలైతేనే ఈ సమ్మర్ సీజన్‌లో టాప్ స్టార్ సినిమా ఒకటి కనిపించవచ్చు. లేకపోతే ఈసారి తెలుగు ప్రేక్షకులకు టాప్ హీరోల సినిమాల రుచి దక్కకుండా సమ్మర్ ముగిసిపోతుంది.