‘ది రాజా సాబ్‘ ప్రీ టీజర్

రెబెల్ స్టార్ ప్రభాస్ ‘ది రాజా సాబ్‘ టీజర్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. రేపు (జూన్ 16) ఉదయం 10 గంటల 52 నిమిషాలకు టీజర్ రిలీజ్ కాబోతుంది.;

By :  S D R
Update: 2025-06-15 07:40 GMT

రెబెల్ స్టార్ ప్రభాస్ ‘ది రాజా సాబ్‘ టీజర్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. రేపు (జూన్ 16) ఉదయం 10 గంటల 52 నిమిషాలకు టీజర్ రిలీజ్ కాబోతుంది. లేటెస్ట్ గా అందుకు సంబంధించి ఓ చిన్న ప్రీ టీజర్ ను వదిలారు మేకర్స్. టీజర్ పై మరింత క్యూరియాసిటీ పెంచేలా ఈ ప్రీ టీజర్ ఉంది. కొంతమంది నటులతో పాటు హీరోయిన్లు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ కూడా టీజర్ సర్ప్రైజ్ కోసం ఎదురుచూస్తున్నట్టుగా ఈ ప్రీ టీజర్ విజువల్స్ కట్ చేశారు.

మొత్తంగా.. వరుసగా యాక్షన్ మోడ్ లో చెలరేగిపోతున్న రెబెల్ స్టార్ నుంచి రాబోతున్న రొమాంటిక్ హారర్ జానర్ మూవీ ‘ది రాజా సాబ్‘. ఇప్పటికే ఇలాంటి తరహా సినిమాలతో ఘన విజయాలందుకున్న మారుతి.. ఈ సినిమాని సమ్ థింగ్ స్పెషల్ గా తీర్చిదిద్దాడట. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. డిసెంబర్ 5న ‘ది రాజా సాబ్‘ విడుదలకు ముస్తాబవుతుంది.


Full View


Tags:    

Similar News