డబ్బు చుట్టూ తిరిగే 'కుబేర'
కాంబినేషన్స్ కంటే కథనే నమ్మకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల. అయితే.. ఈసారి కథతో పాటు కాంబినేషన్ ను కూడా సెట్ చేశాడు. ఇప్పటివరకూ స్టార్స్ వైపు పెద్దగా దృష్టిపెట్టని శేఖర్ ఈసారి నాగార్జున-ధనుష్-రష్మిక వంటి స్టార్స్ తో తెరకెక్కించిన చిత్రం 'కుబేర'.;
కాంబినేషన్స్ కంటే కథనే నమ్మకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల. అయితే.. ఈసారి కథతో పాటు కాంబినేషన్ ను కూడా సెట్ చేశాడు. ఇప్పటివరకూ స్టార్స్ వైపు పెద్దగా దృష్టిపెట్టని శేఖర్ ఈసారి నాగార్జున-ధనుష్-రష్మిక వంటి స్టార్స్ తో తెరకెక్కించిన చిత్రం 'కుబేర'. తమిళ విలక్షణ నటుడు ధనుష్ టైటిల్ రోల్ లో నాగార్జున కీలక పాత్రలో కనిపించబోతున్న ఈ చిత్రం జూన్ 20న విడుదలకానుంది. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు.
ఆద్యంతం డబ్బు చుట్టూ సాగే కథతో 'కుబేర' రూపొందింది. ఈ మూవీలో బిచ్చగాడుగా ధనుష్ సహజంగా కనిపిస్తున్నాడు. నాగార్జున, రష్మిక పాత్రలకు కథలో ఎంతో ప్రాధాన్యత ఉండబోతున్నట్టు తెలుస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సాంగ్స్, బి.జి.ఎమ్ 'కుబేర'కి మరో ప్లస్ పాయింట్. మొత్తంగా.. శేఖర్ కమ్ముల స్టైల్ లో సహజత్వానికి పెద్ద పీట వేస్తూ సరికొత్తగా 'కుబేర' రాబోతుంది.