అత్యధిక పారితోషికం అందుకుంటున్న సౌత్ బ్యూటీస్ వీళ్ళే !
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలు ఇప్పుడు పాన్-ఇండియా విజయాలు సాధిస్తుండగా, దక్షిణాది నటీనటులకు దేశవ్యాప్తంగా అపారమైన క్రేజ్ పెరిగింది. కేవలం హీరోలు మాత్రమే కాదు, సౌత్ హీరోయిన్‌లు కూడా ఇటీవల భారీ గుర్తింపును తెచ్చుకుని, దేశంలోని అత్యధిక పారితోషికం అందుకుంటున్న నాయికలుగా నిలిచారు. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం అత్యధిక పారితోషికం తీసుకుంటున్న దక్షిణాది నాయికల లిస్ట్ ఇదే..
సాయి పల్లవి
తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో తన అసాధారణ నటనతో, అద్భుతమైన నృత్యంతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి సాయి పల్లవి. తాజాగా ఆమె "తండేల్" చిత్రానికి రూ. 5 కోట్ల పారితోషికం అందుకున్నట్లు సమాచారం. అలాగే, నితేశ్ తివారి దర్శకత్వం వహిస్తున్న "రామాయణం" అనే హిందీ చిత్రానికి ఆమె రూ. 18-20 కోట్లు తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
రష్మిక మందన్న
నేషనల్ క్రష్ గా పిలుచుకొనే రష్మిక మందన్న.. "పుష్ప 2", "యానిమల్", "ఛావా" వంటి బ్లాక్‌బస్టర్లతో తన స్థానాన్ని మరింత పెంచుకుంది. "పుష్ప 2" చిత్రానికి ఆమె రూ. 10 కోట్లు, "ఛావా" చిత్రానికి రూ. 4 కోట్లు పారితోషికంగా అందుకున్నట్లు తెలుస్తోంది. అలాగే, రాబోయే "సికందర్" అనే చిత్రానికి ఆమె రూ. 4 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం.
నయనతార
మలయాళ బ్యూటిఫుల్ హీరోయిన్ నయనతార... తమిళ చిత్ర పరిశ్రమలో అగ్రస్థానాన్ని కొనసాగిస్తోంది. "జవాన్" అనే బాలీవుడ్ చిత్రానికి ఆమె రూ. 10 కోట్లు పారితోషికంగా అందుకున్నట్లు తెలుస్తోంది. ఇక, ఆమె తన వివాహ డాక్యుమెంటరీ హక్కులను నెట్ ఫ్లిక్స్ కి అమ్మి రూ. 25 కోట్లు తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
త్రిష
సౌత్ ఇండస్ట్రీలో గత రెండు దశాబ్దాలుగా తన ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న త్రిష, ప్రస్తుతం రూ. 10-12 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్లు సమాచారం. రాబోయే "విశ్వంభర" చిత్రానికి ఆమె రూ. 12 కోట్లు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అనుష్క
ప్రస్తుతం తక్కువ సినిమాలు చేస్తున్నా, ఒక్కో సినిమాలో నటించేందుకు అనుష్క భారీగా పారితోషికం తీసుకుంటోంది. ఆమె ఒక సినిమాకు రూ. 6 కోట్ల వరకు అందుకుంటుందని సమాచారం. "బాహుబలి 2", ఆమె తాజా మలయాళ చిత్రం "కత్తనార్" చిత్రాలకు చెరో రూ. 5 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది.
సో .... దక్షిణాది చిత్రపరిశ్రమకు చెందిన ఈ నాయికలు దేశవ్యాప్తంగా తమ ప్రభావాన్ని చూపిస్తూనే.. అత్యధిక పారితోషికం అందుకుంటూ అగ్రస్థాయిలో కొనసాగుతున్నారు.