బర్త్ డే కానుకగా ఏదైనా గ్లింప్స్ ఉంటుందా?

మహేష్ బాబు పుట్టినరోజైన ఆగస్టు 9న అభిమానులు కనీసం ఒక పోస్టర్ లేదా వీడియో గ్లింప్స్ విడుదలయ్యే అవకాశం ఉందని ఆశిస్తున్నారు. అయితే .. టీమ్‌కి సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం, అలాంటి ఏ ఏర్పాటూ జరగడం లేదు.;

By :  K R K
Update: 2025-08-07 06:55 GMT

సూపర్‌స్టార్ మహేష్ బాబు మూడు రోజుల్లో 50వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఆగస్టు 9న ఈ మైలురాయి పుట్టినరోజు వేడుక జరగనుంది. ఈ హ్యాండ్సమ్ హీరో ప్రస్తుతం డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి రూపొందిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ చిత్రం లో నటిస్తున్నారు. ఈ గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ థ్రిల్లర్ షూటింగ్ ఈ ఏడాది జనవరిలో మొదలైంది. ఇప్పటికే కొన్ని కీలక ఎపిసోడ్స్, ఒక పాట చిత్రీకరణ పూర్తయింది.

మహేష్ బాబు, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం నిర్మాణంలో ఉన్న అత్యంత ఆసక్తికరమైన భారీ ఇండియన్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. రాజమౌళి సాధారణ శైలికి భిన్నంగా... ఈ చిత్రం గురించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదా అప్‌డేట్ రాజమౌళి టీమ్ నుంచి రాలేదు. సహజంగా, మహేష్ బాబు పుట్టినరోజైన ఆగస్టు 9న అభిమానులు కనీసం ఒక పోస్టర్ లేదా వీడియో గ్లింప్స్ విడుదలయ్యే అవకాశం ఉందని ఆశిస్తున్నారు.

అయితే .. టీమ్‌కి సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం, అలాంటి ఏ ఏర్పాటూ జరగడం లేదు. రాజమౌళి ఎలాంటి ప్రమోషనల్ మెటీరియల్‌ను మహేష్ బాబు పుట్టినరోజు కోసం సిద్ధం చేయలేదట. ఈ చిత్రం ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని, బహుశా 2028లో విడుదలయ్యే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నారట. అందువల్ల, ప్రమోషన్స్ మొదలుపెట్టడానికి ఇంకా చాలా సమయం ఉందని రాజమౌళి టీమ్ భావిస్తోంది.

Tags:    

Similar News