చిత్రీకరణ చివరి దశలో ‘ది రాజాసాబ్’
95 శాతం షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయింది. మిగిలినవి కేవలం మూడు సాంగ్స్, కొన్ని మైనర్ ప్యాచ్‌వర్క్ సీన్స్ మాత్రమే. టీజర్ డ్రాప్ అయినప్పటి నుంచి ఫ్యాన్స్‌లో హైప్ పీక్స్‌లో ఉంది.;
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తొలిసారి హారర్-ఫాంటసీ జోనర్‌లో చేసిన ‘ది రాజాసాబ్’ సినిమా ఫైనల్ టచ్ కు సిద్ధమవుతోంది. 95 శాతం షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయింది. మిగిలినవి కేవలం మూడు సాంగ్స్, కొన్ని మైనర్ ప్యాచ్‌వర్క్ సీన్స్ మాత్రమే. టీజర్ డ్రాప్ అయినప్పటి నుంచి ఫ్యాన్స్‌లో హైప్ పీక్స్‌లో ఉంది. ప్రభాస్‌లో ఇప్పటివరకు ఎవరూ చూడని డార్క్, ఇంటెన్స్ సైడ్‌ని టీజర్ రివీల్ చేసింది.
మారుతి డైరెక్షన్‌లో, టి.జి. విశ్వప్రసాద్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా థియేటర్స్‌లో గ్రాండ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి రెడీ అవుతోంది. ఇండియాలో ఇప్పటివరకు హారర్ జోనర్‌లో నిర్మించని విధంగా అతిపెద్ద సెట్‌లో ఈ సినిమాని తెరకెక్కించారు. ప్రొడక్షన్ టీమ్ ఫుల్ డెడికేషన్‌తో ఈ ప్రాజెక్ట్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది. హై-ఎండ్ 3డి విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ సినిమా హారర్ ఎక్స్‌పీరియన్స్‌ని రీడిఫైన్ చేయబోతోంది. మేకర్స్ చెప్పినట్లు, విఎఫ్‌ఎక్స్ వర్క్ ఇప్పటికే కిక్‌స్టార్ట్ అయింది. ఇది సినిమాకి మేజర్ హైలైట్ అవుతుందని టాక్.
ప్రభాస్‌తో పాటు సంజయ్ దత్, నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ లాంటి స్టార్ కాస్ట్ ఈ సినిమాలో కీ రోల్స్‌లో కనిపించబోతున్నారు. ఈ స్టైలిష్ సూపర్‌నాచురల్ స్టోరీలో ప్రతి క్యారెక్టర్‌కి డెప్త్ ఉంది. ఇంటెన్స్ నెరేషన్‌తో ఈ సినిమా విజువల్ స్పెక్టకిల్‌తో పాటు థ్రిల్‌ని కూడా ఇవ్వబోతోంది. హారర్‌ని ఫాంటసీ, మాస్ ఎలిమెంట్స్‌తో మిక్స్ చేసి అందించడం తెలుగు సినిమా స్పేస్‌లో ఫ్రెష్ అటెంప్ట్. మారుతి టీమ్ ఈ కాంబినేషన్‌ని పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేసినట్లు కనిపిస్తోంది.