మహేశ్ బాబుకు థాంక్స్ చెప్పిన శ్రీలంకన్ ఎయిర్ లైన్స్ !
తాజాగా.. శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ మహేష్ బాబు ప్రయాణంలో ఓ స్పెషల్ మూమెంట్‌ని ఫ్యాన్స్‌తో పంచుకుంది.;
సూపర్‌స్టార్ మహేష్ బాబు తన కూతురు సితార 13వ బర్త్‌డే సెలబ్రేషన్స్ కోసం హైదరాబాద్ నుంచి బయల్దేరాడు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో పాపరాజీలు అతని కూల్ లుక్‌ని, సింపుల్ యెట్ క్లాసీ స్వాగ్‌ని కెమెరాలో లాక్ చేశారు. ఫ్యాన్స్‌ని ఎప్పటిలాగే మెస్మరైజ్ చేస్తూ .. మహేష్ బాబు ఈ ట్రిప్‌లోనూ తన చార్మ్‌తో అదరగొట్టాడు.
తాజాగా.. శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ మహేష్ బాబు ప్రయాణంలో ఓ స్పెషల్ మూమెంట్‌ని ఫ్యాన్స్‌తో పంచుకుంది. హైదరాబాద్ నుంచి కొలంబోకి వెళ్తున్న ఫ్లైట్‌లో మహేష్‌తో ఎయిర్‌లైన్స్ క్రూ సెల్ఫీ టైమ్ తీసుకుంది. అతనితో ఫోటో దిగిన క్రూ, సూపర్‌స్టార్‌ని బోర్డ్‌లో హోస్ట్ చేయడం పట్ల సూపర్ ఎక్సైటెడ్‌గా ఫీల్ అయ్యారు. ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వాళ్లు రాసిన క్యాప్షన్ అదిరిపోయింది.
“సౌత్ ఇండియన్ సినిమా లెజెండ్, సూపర్‌స్టార్ మహేష్ బాబుని హైదరాబాద్ నుంచి కొలంబోకి శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్‌లో స్వాగతించడం మాకు ఫుల్ థ్రిల్! మా క్రూ ఈ సెలబ్రిటీ గెస్ట్‌ని హోస్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మాతో ఫ్లై చేసినందుకు బిగ్ థ్యాంక్స్, సర్...’’ అంటూ రాశారు. మహేష్ బాబు ప్రస్తుతం బాహుబలి ఫేమ్ ఎస్.ఎస్. రాజమౌళితో కలిసి భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ లో ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు.