ముచ్చటగా మూడోసారి ?
గతంలో వీరిద్దరి కాంబోలో 'జబర్దస్త్', 'ఓ బేబీ' చిత్రాలు వచ్చాయి. వీటిలో 'జబర్దస్త్' డిజాస్టర్ అయినప్పటికీ.. 'ఓ బేబీ' మాత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు వారు మళ్లీ తమ గత విజయాన్ని రిపీట్ చేయాలని ఆశిస్తున్నారు.;
సమంతా రుత్ ప్రభు, 'ఖుషి' చిత్రంలో పూర్తి స్థాయి హీరోయిన్‌గా చివరిసారిగా కనిపించింది. రీసెంట్ గా ఆమె తన తొలి నిర్మాణ సినిమా 'శుభం'లో ప్రత్యేక పాత్రలో కనిపించింది. అయితే.. ఆమె అభిమానులు మాత్రం ఆమె హీరోయిన్‌గా గ్రేట్ కమ్ బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఆమె మూడోసారి దర్శకురాలు నందిని రెడ్డితో జతకట్టబోతోంది. ఫిల్మ్ సర్కిల్స్‌లో వస్తున్న టాక్ ప్రకారం.. సమంతా నందిని రెడ్డి దర్శకత్వంలో ఓ కొత్త తరహా సోషల్ డ్రామాలో నటించబోతోందట.
గతంలో వీరిద్దరి కాంబోలో 'జబర్దస్త్', 'ఓ బేబీ' చిత్రాలు వచ్చాయి. వీటిలో 'జబర్దస్త్' డిజాస్టర్ అయినప్పటికీ.. 'ఓ బేబీ' మాత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు వారు మళ్లీ తమ గత విజయాన్ని రిపీట్ చేయాలని ఆశిస్తున్నారు. సమంతా ఈ సినిమాని తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా, తక్కువ బడ్జెట్‌తో నిర్మించాలని ప్లాన్ చేస్తోంది. ఈ సినిమా కోసం ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలైనట్లు సమాచారం.
'శుభం' కోసం పనిచేసిన కోర్ టీమ్‌ని ఈ చిత్రానికి కూడా సామ్ కొనసాగించనుందట. సమంతా, నందిని రెడ్డి కలిసి మళ్లీ పనిచేస్తారనే ఊహాగానాలు గత కొంతకాలంగా వినిపిస్తున్నప్పటికీ.. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఫైనల్‌గా ఆరంభమవుతోంది. ఈ సినిమాతో పాటు సమంత ప్రస్తుతం రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో 'రక్త బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్' అనే ప్రాజెక్ట్‌లో కూడా పనిచేస్తోంది.