జూలై 25న ‘వార్ 2‘ ట్రైలర్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మల్టీస్టారర్ 'వార్ 2'.;
By : S D R
Update: 2025-07-22 07:15 GMT
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మల్టీస్టారర్ 'వార్ 2'. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణంలో, అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ ఆగస్టు 14న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.
తెలుగులో ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ చేయబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ రాగా.. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కు డేట్ ఫిక్సయ్యింది. జూలై 25న ‘వార్ 2‘ ట్రైలర్ రాబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది టీమ్. ట్రైలర్ నిడివి 2 నిమిషాల 39 సెకన్లు అని తెలుస్తోంది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు.