మ్యూజిక్ సెషన్స్ లో 'VT15'

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం తన 15వ చిత్రంగా ఓ హారర్-కామెడీతో బిజీగా ఉన్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను యూవి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.;

By :  S D R
Update: 2025-07-22 01:16 GMT

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం తన 15వ చిత్రంగా ఓ హారర్-కామెడీతో బిజీగా ఉన్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను యూవి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇండో-కొరియన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సత్య, మిర్చి కిరణ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

తాజాగా మేకర్స్ ఈ సినిమా మ్యూజిక్ సెషన్స్ ప్రారంభమైనట్టు తెలియజేశారు. సంగీత దర్శకుడు తమన్, వరుణ్ తేజ్ కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ 'బ్లాక్‌బస్టర్ మ్యూజికల్ ద్వయం నుండి అద్భుతమైన ఆల్బమ్ కోసం సిద్ధంగా ఉండండి' అనే క్యాప్షన్‌తో అప్‌డేట్ ఇచ్చారు. ఇప్పటికే ఈ సినిమా కోసం ఇండియా, విదేశాల్లో మూడు షెడ్యూల్స్ పూర్తి కాగా, రెండు పాటల చిత్రీకరణ కూడా పూర్తైంది. త్వరలో ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నారు.

Tags:    

Similar News