సైలెన్స్ ఈజ్ ద బెస్ట్ పాలసీ : సితార ఘట్టమనేని
ఓ అభిమాని ‘యస్ యస్ యమ్ బీ 29’ అప్‌డేట్ గురించి ప్రశ్నించగా.. సితార ఎంతో చాకచక్యంగా స్పందించింది. "సైలెన్స్ ఈజ్ ది బెస్ట్ పాలసీ" అని సమాధానం చెప్పింది.;
సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘యస్ యస్ యమ్ బీ 29’ సినిమా భారతీయ సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటిగా నిలిచింది. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రకటించినప్పటి నుంచి వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా, హైదరాబాద్‌లో జరిగిన ఓ ఈవెంట్‌కు మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ తన కుమార్తె సితార తో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఓ అభిమాని ‘యస్ యస్ యమ్ బీ 29’ అప్‌డేట్ గురించి ప్రశ్నించగా.. సితార ఎంతో చాకచక్యంగా స్పందించింది. "సైలెన్స్ ఈజ్ ది బెస్ట్ పాలసీ" అని సమాధానం చెప్పింది. ఆమె చమత్కారమైన సమాధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు "తండ్రికి తగిన కూతురు" అంటూ ప్రశంసలు గుప్పిస్తున్నారు.
ఎస్.ఎస్. రాజమౌళి సినిమా గురించి ఎలాంటి వివరాలూ బయటకు రానివ్వకుండా గోప్యతను కాపాడుతున్నారు. అయితే.. ఒడిశాలోని కోరాపుట్ ప్రాంతంలో షూటింగ్ జరిగిన విషయం బయటకు వచ్చింది. ఈ షెడ్యూల్ ముగిసిన తర్వాత మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, రాజమౌళి సంబంధిత కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. వైరల్ ఫొటోలలో మహేష్ బాబు నీలిరంగు టీ-షర్ట్, ట్రాక్ ప్యాంట్, తన ప్రత్యేకమైన ఎర్ర క్యాప్ ధరించి ఉన్నారు. ప్రియాంక చోప్రా ఓవర్‌సైజ్డ్ షర్ట్, మ్యాచింగ్ బాటమ్స్ ధరించి కనిపించింది. షూటింగ్ స్పాట్‌లో వీరిద్దరూ అభిమానులు, సిబ్బందితో మాట్లాడుతున్న దృశ్యాలు కనిపించాయి.
ఈ షెడ్యూల్ సందర్భంగా ఒడిశా ఎమ్మెల్యే రామచంద్ర కడం, రాజమౌళికి స్వాగతం పలికిన దృశ్యాలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. రాజమౌళి, ఒడిశా గెస్ట్ హాస్పిటాలిటీకి ధన్యవాదాలు తెలిపిన లేఖ కూడా ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది. ఈ సినిమాతో మలయాళ నటుడు పృధ్విరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇంక ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొంది స్తున్నారు. మొదటి భాగం 2027లో విడుదల అవుతుండగా... రెండో భాగం 2029 లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.