ప్రవస్తి ఇలా చేయడం సరికాదు : గాయని సునీత

“పుకార్లతో వ్యక్తిత్వం నిర్మాణం కాదు. అలాగే అవి కీర్తిని నాశనం చేయవు. సత్యం తప్పకుండా బయట పడుతుంది.” అని తెలిపింది.;

By :  K R K
Update: 2025-04-22 13:58 GMT

ప్రఖ్యాత గాయని, “పాడుతా తీయగా” రియాలిటీ షో జడ్జ్ అయిన సునీత, కంటెస్టెంట్ ప్రవస్తి ఆరాధ్య చేసిన తీవ్రమైన ఆరోపణలపై తాజాగా ఒక వీడియో విడుదల చేసింది. సునీత ప్రవస్తి ఆరోపణలకు స్పందిస్తూ .. “పుకార్లతో వ్యక్తిత్వం నిర్మాణం కాదు. అలాగే అవి కీర్తిని నాశనం చేయవు. సత్యం తప్పకుండా బయట పడుతుంది.” అని తెలిపింది.

ప్రవాస్తి, ఇటీవల షో నుండి తొలగించబడిన తర్వాత, సునీత, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గీత రచయిత చంద్రబోస్‌లపై వివక్ష, వేధింపుల ఆరోపణలు చేసింది. సునీత స్పష్టం చేస్తూ.. “ప్రవస్తి చిన్నపిల్లగా ఉన్నప్పుడు నేను ఆమెను ఒడిలో కూర్చోబెట్టి ప్రోత్సహించాను. కానీ ఆమెకు ఇప్పుడు 19 ఏళ్లు. పెద్ద అమ్మాయి అయి ఉండి ఇలా చేయడం సరికాదు” అని తెలిపింది.

“ప్రవస్తి నా పేరు చెప్పి ఆరోపణలు చేసింది, అందుకే స్పందిస్తున్నాను. లేకపోతే నేను ఆధారం లేని పుకార్లకు జవాబు ఇవ్వను” అని సునీత చెప్పింది. ఇక పాటల ఎంపిక గురించి వివరిస్తూ, “ప్రవస్తికి తెలుసు.. టీవీ ఛానెల్స్‌కి రైట్స్ ఉన్న పాటలనే ఎంచుకుంటాయి. రైట్స్ లేని పాటలను ఉపయోగించలేము. అందుకే కొన్ని పాటలను ఎంచుకోవడం లేదా తప్పించడం జరుగుతుంది. ఇందులో ఎలాంటి దాగుడుమూతలు లేవు” అని సునీత తెలిపారు. ఎంఎం కీరవాణి, చంద్రబోస్ ఇంకా ప్రవాస్తి ఆరోపణలకు స్పందించలేదు.

Tags:    

Similar News