ఆ రెండు ప్రాజెక్టులపైనే ఇతడి ఆశలన్నీ !

త్వరలో నెట్‌ఫ్లిక్స్ కోసం రూపొందిన ఒక వెబ్ డ్రామాలో కనిపించబోతున్నాడు. ఈ వెబ్ సిరీస్ పేరు 'సూపర్ సుబ్బు'. ఇందులో సందీప్ కిషన్ ‘సుబ్బు’ అనే యువకుడిగా నటించాడు.;

By :  K R K
Update: 2025-04-08 00:32 GMT

సందీప్ కిషన్‌ తన 30వ సినిమా అయిన 'మజాకా' తో హిట్ కొట్టాలని ఆశించాడు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా ఫెయిలై.. అతడిని తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ సినిమా పరాజయంతో ప్రభావితమైన అంశాల్లో ఒకటి ఏమిటంటే... ఒక తెలుగు నిర్మాణ సంస్థ అతనితో సినిమా ప్రకటించాలను కున్నప్పటికీ, ఇప్పుడు ఆ ఆలోచనను విరమించుకుందట. ఈ కారణంగా ప్రస్తుతం సందీప్ కిషన్‌కి టాలీవుడ్ లో ఎలాంటి ప్రాజెక్ట్ లేకుండా పోయింది.

అయితే... అతడు.. త్వరలో నెట్‌ఫ్లిక్స్ కోసం రూపొందిన ఒక వెబ్ డ్రామాలో కనిపించబోతున్నాడు. ఈ వెబ్ సిరీస్ పేరు 'సూపర్ సుబ్బు'. ఇందులో సందీప్ కిషన్ ‘సుబ్బు’ అనే యువకుడిగా నటించాడు. ఊహించని పరిస్థితుల్లో ఓ పల్లెటూరిలో సెక్స్ ఎడ్యుకేషన్ టీచర్‌గా మారిన యువకుడి పాత్ర ఇది. ఈ తెలుగు ఒరిజినల్ సిరీస్ త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్‌కి రానుంది.

ఇంతేకాకుండా.. సందీప్ తమిళంలో కూడా ఓ సినిమాలో నటిస్తున్నాడు. దీన్ని తమిళ దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది అతడికి దర్శకుడిగా తొలి సినిమా కావడంతో మంచి హైప్ ఉంది. ఈ సినిమా విషయంలో సందీప్ ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. అతడికి తమిళంలో కూడా ఓ గుర్తింపు ఉండటంతో.. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ అయితే, తమిళంలో హీరోగా తన కెరీర్‌కి మరింత మంచి జోరు వస్తుందని ఆశిస్తున్నాడు. 

Tags:    

Similar News