మెగా సెట్స్ లో పూరి-సేతుపతి!

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కలయికలో సినిమాకోసం చాన్నాళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే.. వీరి కలయికలో సినిమా కుదరకపోయినా సమయం చిక్కినప్పుడల్లా ఒకరికొకరు కలుసుకుంటూనే ఉంటారు.;

By :  S D R
Update: 2025-09-10 13:48 GMT

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కలయికలో సినిమాకోసం చాన్నాళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే.. వీరి కలయికలో సినిమా కుదరకపోయినా సమయం చిక్కినప్పుడల్లా ఒకరికొకరు కలుసుకుంటూనే ఉంటారు. లేటెస్ట్ గా మెగాస్టార్ 'మనశంకరవరప్రసాద్ గారు' సెట్స్ లో సందడి చేసింది పూరి-సేతుపతి టీమ్.

ఈ రెండు చిత్రాల యూనిట్స్ రామోజీ ఫిల్మ్‌సిటీలో పక్కపక్కనే షూటింగ్ జరుపుకోవడం విశేషం. ఇదే సందర్భంలో పూరి–సేతుపతి టీమ్ మెగాస్టార్ సెట్స్‌కి వెళ్లి చిరంజీవిని కలుసుకున్నారు. ఈ అపూర్వమైన క్రాస్ ఓవర్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫొటోలలో చిరు, విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్, ఛార్మి, నయనతార, సంయుక్త మీనన్, టబు, అనిల్ రావిపూడి తదితరులు ఒకే ఫ్రేమ్‌లో దర్శనమిచ్చారు.

Tags:    

Similar News