నేను ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉన్నాను : సమంత

“ఈ రోజు నేను రెండేళ్లుగా ఒక్క సినిమా రిలీజ్ కాకుండా ఉన్నాను. ఏ లిస్ట్‌ లోనూ నేను లేను. నా ఖాతాలో వెయ్యి కోట్ల సినిమా లేదు. కానీ నేను ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉన్నాను..” అని సమంతా అంది.;

By :  K R K
Update: 2025-09-13 00:42 GMT

సమంతా రుత్ ప్రభు ఇటీవల ఢిల్లీలో జరిగిన 52వ నేషనల్ మేనేజ్‌మెంట్ కన్వెన్షన్‌లో అల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మనసు విప్పి మాట్లాడింది. గత రెండేళ్లలో ఒక్క సినిమా కూడా విడుదల కానప్పటికీ, జీవితంలో సంతృప్తిని పొందినట్లు ఆమె చెప్పింది. మయోసైటిస్‌తో పోరాడిన తర్వాత ఆమె జీవితం ఎలా మారిపోయిందో వివరించింది.

“ఈ రోజు నేను రెండేళ్లుగా ఒక్క సినిమా రిలీజ్ కాకుండా ఉన్నాను. ఏ లిస్ట్‌ లోనూ నేను లేను. నా ఖాతాలో వెయ్యి కోట్ల సినిమా లేదు. కానీ నేను ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉన్నాను..” అని సమంతా అంది. ఆమె తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న తీవ్రమైన ఒత్తిడి గురించి కూడా చెప్పింది. “ప్రతి శుక్రవారం ఆందోళనగా ఉండేది. ఎవరైనా నా స్థానాన్ని ఆక్రమిస్తారేమోనని భయం ఉండేది. నా విలువ అంతా ఆ శుక్రవారం బాక్సాఫీస్ నెంబర్లతోనే సరితూగేది...” అని ఆమె ఒప్పుకుంది.

అయితే.. ఆరోగ్య సమస్యల తర్వాత సమంతా తన వ్యక్తిగత జీవితంలోనూ, కెరీర్‌లోనూ శాంతిని పొందింది. ఇకపై బాహ్య విజయాలు ఆమె సంతోషాన్ని నిర్ణయించడం లేదు. సమంతా తదుపరి దర్శకురాలు నందినీ రెడ్డితో కలిసి పని చేయనుంది.

Tags:    

Similar News