రామోజీ ఫిల్మ్ సిటీలో కొత్త షెడ్యూల్ ప్రారంభం

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు, ఆర్ మాధవన్, పృథ్వీరాజ్ సుకుమారన్‌లపై కీలక సన్నివేశాలను వారణాసి సెట్‌లో చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తున్నారు.;

By :  K R K
Update: 2025-09-13 01:08 GMT

యస్ యస్ యంబీ 29 సినిమా షూటింగ్‌ కు సంబంధించి మహేష్ బాబు నటిస్తున్న భారీ షెడ్యూల్ కెన్యాలో పూర్తయింది. షెడ్యూల్.. ప్లాన్ ప్రకారం సజావుగా సాగింది. టీమ్ కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌కు తిరిగి వచ్చింది. చిన్న విరామం తర్వాత.. నిన్నటి నుంచి హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది.

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు, ఆర్ మాధవన్, పృథ్వీరాజ్ సుకుమారన్‌లపై కీలక సన్నివేశాలను వారణాసి సెట్‌లో చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఇది వారం రోజుల పాటు విరామం లేకుండా కొనసాగుతుంది. ప్రియాంక చోప్రా తర్వాత షూటింగ్‌లో చేరనున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి ఎన్నో ఊహాగానాలు తిరుగుతున్నాయి. అయితే నవంబర్‌లో టీమ్ అధికారిక అప్‌డేట్స్ ప్రకటించనుంది.

ఇది అత్యంత ఖరీదైన చిత్రంగా చెప్పబడుతోంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అలాగే .. ఈ సినిమా ఒకే భాగంగా రూపొందుతోంది. ఫారెస్ట్ అడ్వెంచర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో స్టైలిష్ యాక్షన్ ఉంటుంది. కెఎల్ నారాయణ నిర్మాతగా, కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా 2027లో విడుదలయ్యే అవకాశం ఉంది.

Tags:    

Similar News