'ఆర్ ఆర్ ఆర్ ' ప్రపంచ ప్రేక్షకుల్ని ఊర్రూతలూగించింది : నరేంద్ర మోది

Update: 2025-05-03 06:57 GMT

'ఆర్ ఆర్ ఆర్ ' ప్రపంచ ప్రేక్షకుల్ని ఊర్రూతలూగించింది : నరేంద్ర మోదిఇటీవల ముంబైలో జరిగిన వేవ్స్ సమ్మిట్‌ ఒక భారీ సినీ-సాంస్కృతిక వేదికగా మారింది. ఈ కార్యక్రమానికి భారత సినిమా రంగంలోని అగ్రతారలు హాజరయ్యారు. దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి, ప్రముఖ నటుడు ఆమిర్ ఖాన్, నటి ఆలియా భట్ మొదటి వరుసలో కూర్చొని అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే, ఈ సభలో ప్రధాన ఆకర్షణగా నిలిచిన వ్యక్తి దేశ గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ

ఈ సమావేశంలో ప్రధాని మోదీ తన ప్రసంగంలో దర్శకుడు రాజమౌళి గారి సినిమా ఆర్ ఆర్ ఆర్పై ప్రశంసలు కురిపించారు. "ఆర్ ఆర్ ఆర్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించేలా చేసింది. భారతీయ సినిమాలు ప్రామాణికతను పెంచుతూ గ్లోబల్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో రాజమౌళి వంటి దర్శకులు భారతీయ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు" అని ఆయన పేర్కొన్నారు.

మోదీ మాట్లాడిన ఈ మాటలు నెట్‌లో వైరల్‌గా మారాయి. దేశ ప్రజలంతా ఈ వ్యాఖ్యలపై స్పందిస్తున్నారు. "భారతీయ సినిమాలు గత నూరు సంవత్సరాల్లో ప్రపంచానికి తమ కథలు వినిపించాయి. రష్యాలో రాజ్ కపూర్, కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సత్యజిత్ రే, ఆస్కార్ గెలిచిన ఆర్ ఆర్ ఆర్.. ఇవన్నీ భారతీయ సినిమాల సత్తాను ప్రదర్శిస్తున్నాయి" అని మోదీ అన్నారు.

ఈ ప్రశంసలు కేవలం ఒక గౌరవ సూచిక మాత్రమే కాకుండా, భారతీయ సినిమాకు ప్రపంచస్థాయిలో మరింత గుర్తింపు తీసుకురావడంలో కీలకంగా మారాయి. మోదీ గారి నిశ్చలమైన ప్రశంసలు రాజమౌళి గారిపై విశేషంగా చూపించబడటంతో పాటు, భారతీయ సినిమా ప్రభావాన్ని కొత్త పుంతలు తొక్కించేలా చేశాయి.

Tags:    

Similar News