స్పిరిచ్యువల్ ఎమోషనల్ రైడ్ గా ‘అఖండ 2’

ఈ సినిమాలో హై-ఓక్టేన్ యాక్షన్ సీన్స్‌తో పాటు భావోద్వేగ దృశ్యాలు కూడా ఉంటాయని తెలుస్తోంది. ‘అఖండ’ మొదటి భాగంలో తల్లి సెంటిమెంట్‌ని ఎలివేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సీక్వెల్‌లో కూడా అలాంటి ఎమోషనల్ సీన్స్ ఉంటాయని సమాచారం.;

By :  K R K
Update: 2025-08-15 02:00 GMT

బాలకృష్ణ ప్రస్తుతం తన కొత్త ఎంటర్‌టైనర్ సినిమా ‘అఖండ2 తాండవం’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. హిట్ చిత్రం ‘అఖండ’ కి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ మూవీపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఎందుకంటే ఇది వివిధ భాషల్లో విడుదల కానుంది. బాలకృష్ణ స్వయంగా తన రోల్ కోసం హిందీలో డబ్బింగ్ చేస్తున్నారు.

ఈ సినిమాలో హై-ఓక్టేన్ యాక్షన్ సీన్స్‌తో పాటు భావోద్వేగ దృశ్యాలు కూడా ఉంటాయని తెలుస్తోంది. ‘అఖండ’ మొదటి భాగంలో తల్లి సెంటిమెంట్‌ని ఎలివేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సీక్వెల్‌లో కూడా అలాంటి ఎమోషనల్ సీన్స్ ఉంటాయని సమాచారం. ఈ భావోద్వేగ దృశ్యాలు చాలా బాగా పండాయని, అవి సినిమా హైలైట్స్‌లో ఒకటిగా నిలుస్తాయని సోర్సెస్ చెబుతున్నాయి.

ఈ చిత్రాన్ని 2025 సెప్టెంబర్ 25న విడుదల చేయాలని ముందుగా మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే విడుదల తేదీలో మార్పులుండ వచ్చని వార్తలొస్తున్నాయి. థమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్షలి మల్హోత్రా కీలక పాత్రలు పోషిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Tags:    

Similar News