జక్కన్న మాటే తనకి వేదం అంటోన్న గ్లోబల్ బ్యూటీ !
రాజమౌళికి పూర్తిగా సహకరించేలా ప్రియాంక హామీ ఇచ్చినట్టు సమాచారం. షెడ్యూల్ విషయంలో ఎలాంటి షరతులు లేకుండా, దర్శకుడు కోరినన్ని తేదీలు అందించేందుకు ఆమె సిద్ధమయ్యారు.;
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘యస్ యస్ యం.బి 29’. ఈ మూవీలో గ్లోబల్ క్వీన్ ప్రియాంక చోప్రా కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆమె ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసి.. అమెరికాలోని తన నివాసానికి తిరిగి వెళ్ళిపోయింది. అయితే... ఆమె అక్కడ ఎక్కువ కాలం ఉండకుండా ఏప్రిల్ లేదా మే నెలలో వచ్చే తదుపరి షెడ్యూల్ కోసం తిరిగి రావాల్సి ఉంటుంది.
ఈ ప్రాజెక్ట్‌కు సైన్ చేసేముందు... రాజమౌళికి పూర్తిగా సహకరించేలా ప్రియాంక హామీ ఇచ్చినట్టు సమాచారం. షెడ్యూల్ విషయంలో ఎలాంటి షరతులు లేకుండా, దర్శకుడు కోరినన్ని తేదీలు అందించేందుకు ఆమె సిద్ధమయ్యారు. అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి ప్రపంచంలోని ఏ ప్రాంతానికైనా ప్రయాణించి షూటింగ్‌లో పాల్గొనడానికి ఆమె అంగీకరించారని తెలుస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ భారతదేశంతో పాటు విదేశాల్లోనూ జరుగనుంది. వచ్చే ప్రధాన షెడ్యూల్‌ను కెన్యాలో ప్లాన్ చేసినట్టు సమాచారం.
మహేష్ బాబు ఒక సాహసిగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా కథానాయికగా నటించనుండగా.. మరో ప్రముఖ నటి కూడా ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. అదనంగా, మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ భారీ చిత్రానికి ప్రియాంక చోప్రా అందుకుంటున్న పారితోషికం కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. భారతీయ నటీమణులలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న కొద్దిమందిలో ఆమె ఒకరుగా నిలిచారు.
దీపికా పదుకొణె ‘కల్కి 2898 ఏడీ’ కోసం అందుకున్న రెమ్యునరేషన్‌కు సమానంగా.. ప్రియాంక ఈ చిత్రానికి భారీగానే అందుకున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను ఉత్సుకతతో ఎదురు చూసేలా చేస్తున్న ‘యస్ యస్ యంబీ 29’ పాన్ వరల్డ్ మూవీగా ఆడియన్స్ ను ఉర్రూతలూపేందుకు రెడీ అవుతోంది.